»   » షాకింగ్ న్యూస్.. అమీ జాక్సన్ ఫోన్ హ్యాక్.. పర్సనల్ ఫొటోలు లీక్..

షాకింగ్ న్యూస్.. అమీ జాక్సన్ ఫోన్ హ్యాక్.. పర్సనల్ ఫొటోలు లీక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార అమీ జాక్స్ మొబైల్ ఫోన్ హ్యాకింగ్ గురైంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లోకి లీక్ అయ్యాయి. బయటి ప్రపంచానికి తెలియనటువంటి ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో సెన్షేషనల్‌గా మారినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

 లండన్ నుంచి చెన్నై వెళ్తుండగా..

లండన్ నుంచి చెన్నై వెళ్తుండగా..


శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.0 చివరి షెడ్యూల్‌ను ముగించేందుకు లండన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రయాణంలో ఆమె కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం ముంబైలో కాసేపు ఆగాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో కాసేపు కాలక్షేపం చేసింది. ఆ సమయంలోనే ఫోన్ హ్యకింగ్ గురైనట్టు ఆమీ తెలిపింది.

 ఫోన్ హ్యకింగ్ ఎలా గురైందంటే..

ఫోన్ హ్యకింగ్ ఎలా గురైందంటే..


మొబైల్ స్టోర్‌లో అమీ ఉండగా ఫోన్‌లోని ఆటోమేటిక్ సింక్ అనే ఆప్షన్ ఆన్‌లో ఉంది. తన ఫొటోలు ఐక్లౌడ్‌లో భద్రపరిచేందుకు ఆన్‌లో ఉంచుకొన్నది. దాంతో ఆమె ఫోన్ హ్యాక్ అయిందని ఓ జాతీయ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. ‘గత కొన్ని రోజులుగా నా అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కుదరడం లేదు. ఆ సమస్యను నివారించడానికి స్థానిక మొబైల్ స్టోర్‌కు వెళ్లాల్సి వచ్చింది' అని అమీ జాక్సన్ తెలిపింది.

 హ్యాకింగ్ అంశం షాక్ గురిచేసింది

హ్యాకింగ్ అంశం షాక్ గురిచేసింది


తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఈ నెల 7 తేదీన ఆన్‌లైన్‌లో కనిపించడం షాక్ గురిచేసింది. అప్పుడు తన ఫోన్ హ్యాకింగ్ గురైందని తెలుసుకొన్నాను. ‘ఈ హ్యకింగ్ విషయం చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చిన్న విషయమైనా చాలా తీవ్రంగా పరిగణించాల్సిందే. లండన్‌లోని సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేశాను. మొబైల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి' అని తెలిపింది.

 శంకర్ డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా 2.0

శంకర్ డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా 2.0


రోబో చిత్రానికి సీక్వెల్‌గా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 2.0 చిత్రం మరో షెడ్యూల్ పూర్తయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించడం ప్రత్యేకత. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. చిత్రం మరో షెడ్యూల్ ముంబైలో జరుగునున్నది. ఆ షూటింగ్‌లో మళ్లీ కలుద్దామంటూ ఇటీవల ట్వీట్ చేసింది.

English summary
Actress Amy Jackson phone was hacked in mumbai and a couple of personal pictures had found their way to social media. This was happend in Mumbai a couple of days ago to catch a connecting flight to Chennai for the shoot for Robot 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu