2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.

ఎన్.వి.ప్రసాద్ చేతికి తెలుగు వెర్షన్ హక్కులు

ఎన్.వి.ప్రసాద్ చేతికి తెలుగు వెర్షన్ హక్కులు

పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `2.0`. 2.0 చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌, పాట‌, ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో గురవారం విడుద‌ల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాట‌లు, ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

ఆయన వల్లే ఈ సినిమా గొప్పగా

ఆయన వల్లే ఈ సినిమా గొప్పగా

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ - ``విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన `2.0` చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారు సినిమాను అద్భుత‌మైన మెసేజ్‌తో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మ‌లిచారు. ఈ సినిమాతో ఇండియ‌న్ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరుతుంది. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే అందుకు ముఖ్య కార‌ణం శంక‌ర్ అయితే.. ఆయ‌న కంటే ముందు అభినందిచాల్సి వ్య‌క్తి నిర్మాత సుభాష్ క‌ర‌ణ్‌. ఆయ‌న‌కు సినిమాపై ఉన్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈ సినిమాను ఇంత గొప్ప‌గా చేయ‌గ‌లిగాం. ఎంతో మంది టెక్నీషియ‌న్స్ రాత్రింబ‌గ‌ళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా కోసం నేను కూడా అంద‌రితో పాటు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను`` అని తెలిపారు.

త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్

త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్

డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ - ``సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా `2.0`. పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్టైన్‌మెంట్‌. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతారు. రెహ‌మాన్‌గారు, రసూల్ పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మ‌నం చేయ‌గలం అని నిరూపించాం. నిర్మాత‌ సుభాష్ క‌ర‌ణ్ సుభాష్ క‌ర‌ణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్‌ సినిమాను ఇంత బడ్జెట్‌ తో ఎవరూ నిర్మించరు. ఆయ‌న అందించిన ప్రోత్సాహంతో పాటు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అందించిన తోడ్పాటుతో గొప్ప అనుభూతిని ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాం`` అన్నారు.

రీరికార్డింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం

రీరికార్డింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - ``2.0కి సంగీతం చేయ‌డం చాలా గొప్ప అనుభం. ఎనిమిది సినిమాల‌కు ప‌నిచేసినంత అనుభం వ‌చ్చింది. 4డీ అనే సౌండింగ్ టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నాం. రీరికార్డింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది టెక్నీషియ‌న్స్ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు. స‌రికొత్త అనుభ‌వాన్ని ప్రేక్ష‌కులు ఈ న‌వంబ‌ర్ 29న ఫీల్ అవుతారు`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X