థగ్స్ దెబ్బ... 2.0 ఒప్పందానికి నో చెబుతున్న ఎగ్జిబిటర్లు!
రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మెగా బడ్జెట్ మూవీ 2.0 నవంబర్ 29న విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైన సంగతి తెలిసిందే. సౌత్‌లో అయితే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
అయితే నార్త్ ఇండియాలో ఢిల్లీలో బుకింగ్ మొదలైనప్పటికీ చాలా ప్రాంతంలో బుకింగ్ మొదలు కాలేదట. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న ఓ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నార్త్‌లో 2.0 చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'ఎఎ ఫిల్మ్స్' వారు ఎగ్జిబిటర్లకు ఓ కండీషన్ పెట్టారని, దానికి చాలా మంది అంగీకరించడం లేదని తెలుస్తోంది.
'మినిమమ్ గ్యారంటీ ఒప్పందం' మీద సంతకం చేయాలని లేదా డిసెంబర్ 21న 'కెజిఎఫ్' చిత్రాన్ని ప్రదర్శించడానికి అంగీకరించాలని 'ఎఎ ఫిల్మ్స్' వారు వారిపై ఒత్తిడి పెంచుతున్నారట. అయితే ఈ రెండు కండీషన్లు ఒప్పుకోవడానికి చాలా మంది ఎగ్జిబిటర్లు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

కన్నడ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం రైట్స్ దక్కించుకునన ఏఏ ఫిల్మ్స్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2.0ను అడ్డు పెట్టుకుని ఎక్కువ థియేటర్లు సంపాదించడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇంతకు ముందు అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా విషయంలో ఎగ్జిబిటర్లు మినిమమ్ గ్యారంటీ ఒప్పందం మీద సంతకం చేసి భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో 2.0 విషయంలో వారిని అదే భయం వేధిస్తోంది.


Click it and Unblock the Notifications











