రోబో కంటే 10 రెట్లు, నాకు ముందే తెలుసు.. బాహుబలి రిలీజ్‌కు కొన్నిరోజుల ముందు!
ప్రపంచ వ్యాప్తంగా 2.0 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ముగిసిన తొలి షోల నుంచి శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాము సినిమా చూస్తున్నంత సేపు మరో లోకంలో ఉన్న అనుభూతి పొందామని చెబుతున్నారు. దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ తో కలసి అద్భుతం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పని చేసిన శ్రీనివాస్ మోహన్ ఆసక్తికర విశేషాలు తెలియజేసారు.

600 కోట్ల బడ్జెట్‌కు తగ్గట్లుగా
2.0 చిత్రం త్రీడి ఫార్మాట్ లో విజువల్ వండర్ గా తెరకెక్కింది. 600 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం అందుకు తగ్గట్లుగా అద్భుతమైన విజువల్స్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. రజని, అక్షయ్ కుమార్ మధ్య సాగే పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ రూపొందించిన సందేశాత్మక కథ, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం.

ఐ షూటింగ్ జరుగుతున్న సమయంలో
2.0 చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. దర్శకుడు శంకర్ ఈ చిత్ర ఆలోచనని ఐ చిత్ర షూటింగ్ సమయంలో తెలిపారు. ఐ విడుదలైన వెంటనే నేను రాజమౌళి దర్శత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ తో బిజీ అయిపోయా. అప్పటి నుంచే 2.0 చిత్రానికి సంబందించిన వర్క్ ని శంకర్ ప్రారంభించారు.

బాహుబలి విడుదలకు ముందు
బాహుబలి ది బిగినింగ్ చిత్రం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో విడుదలవుతుంది అనగా శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చినట్లు శ్రీనివాస్ మోహన్ తెలిపారు. 2,0 కథ మొత్తం సిద్ధం చేశా. ఇక మనం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలి అని చెప్పారు. దీనితో వెంటనే సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించాం అని శ్రీనివాస్ మోహన్ అన్నారు. శంకర్ తో పనిచేయడం ఎంత సరదాగా ఉంటుందో అంతే ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది అని అన్నారు.

ముందుగానే డిసైడ్ అయ్యారు
2.0 చిత్రాన్ని త్రీడీలో రూపొందించాలని శంకర్ ముందుగానే డిసైడ్ అయ్యారని శ్రీనివాస్ మోహన్ అన్నారు. కథ సిద్ధం చేసినప్పుడే ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొందించాలని శంకర్ అన్నారు. శంకర్ ఒక సారి కథ సిద్ధం చేస్తే షూటింగ్ సమయంలో మళ్ళీ దానిని మార్చరు. షూటింగ్ ఎలా చేయాలి, కెమెరాని ఏ యాంగిల్ లో మూవ్ చేయాలి అనే విషయాల్లో శంకర్ కు అద్భుతమైన క్లారిటీ ఉంటుంది అని శ్రీనివాస్ మోహన్ అన్నారు.

రోబో కంటే 10 రెట్లు
ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొందించి ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందించాలని శంకర్ మొదటిరోజు నుంచి పట్టుదలతో ఉన్నారు. కథ విన్న తరువాత, శంకర్ డెడికేషన్ చూసిన తరువాత ఈ చిత్రం రోబో కంటే 10 రెట్లు పెద్దిగా ఉంటుందని అప్పుడే అనుకున్నా. అందుకు తగ్గట్లుగానే చిత్రం వచ్చిందని శ్రీనివాస్ మోహన్ అన్నారు. వసూళ్ల పరంగా 2.0 చిత్రం ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











