కేరళలో ‘సర్కార్’ రికార్డ్ బద్దలు కొట్టిన 2.0
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 చిత్రం కేరళలో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. మలయాళంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఇతర భాషా చిత్రంగా నిలిచింది. నిన్నటి వరకు ఈ రికార్డ్ తమిళ స్టార్ విజయ్ 'సర్కార్' పేరు మీద ఉండగా... దాన్ని 2.0 చిత్రం తుడిచేసింది.
కేరళ వ్యాప్తంగా 2.0 చిత్రం 458 స్క్రీన్లలో విడుదలైంది. కేరళలో ఈ స్థాయిలో ఇతర ఇండస్ట్రీల హీరోల సినిమాలు విడుదలవ్వడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు సర్కార్ చిత్రం 412 స్క్రీన్లలో విడుదల చేశారు.

మరో వైపు కేరళ వ్యాప్తంగా 2.0 చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరిగాయి. ఇక్కడ శంకర్ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు.
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు రాని అతిపెద్ద విజువల్ వండర్, 3డి ఎపెక్ట్స్, 4డి సౌండింగ్ సినిమా కావడంతో సినీ అభిమానులు, ప్రేక్షకుల్లో 2.0 చిత్రంపై ఆసక్తి మరింత పెంచింది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వినోదాన్ని పంచుతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











