»   » హాలీవుడ్లో ఎగిరిన రజనీకాంత్ రోబో ‘2.0’ హాట్ బెలూన్ (వీడియో)

హాలీవుడ్లో ఎగిరిన రజనీకాంత్ రోబో ‘2.0’ హాట్ బెలూన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో '2.0' చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించారు. అందుకే హాలీవుడ్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా ప్రమోసన్లో భాగంగా అమెరికాలో వరల్డ్ సినిమా కేంద్రమైన హాలీవుడ్ లేక్ పార్క్ వద్ద రోబో '2.0' హాట్ బెలూన్ ఎగురవేశారు. '2.0' చిత్రానికి సంబందించిన ఫోటోలు ముద్రించిన ఈ 100 అడుగుల హాట్ బెలూన్ ద్వారా సినిమాకు ప్రచారం కల్పించడానికి వినూత్నంగా ప్రయత్నించారు.


వీడియో షేర్ చేసిన అక్షయ్

‘2.0' చిత్రంలో రజనీతో పాటు కీలకమైన విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ ఈ హాట్ ఎయిర్ బెలూన్ కు సంబంధించిన వీడియో అభిమానులకు చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం

ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం

హాలీవుడ్ తర్వాత లండన్, ఐరోపా, దక్షిణాసియా దేశాల్లో ఈ హాట్ బెలూన్లు ఎగరనున్నాయి. ఇతర దేశాలతో పాటు ఇండియాలోనూ ప్రమోషన్స్ ముఖ్యమే కాబట్టి అన్ని ప్రధాన నగరాల్లో ఈ హాట్ బెలూన్లను ఎగురవేయాలని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది.


ఇండియాలో అన్ని కార్డులు స్మాష్?

ఇండియాలో అన్ని కార్డులు స్మాష్?

ఇండియాలో ఇప్పటి వరకు దంగల్, బాహుబలి-2 రికార్డులు మాత్రమే ఉన్నాయి. రోబో ‘2.0' సినిమా విడుదలైన తర్వాత ఈ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.


ఖర్చు కూడా హాలీవుడ్ స్థాయిలోనే

ఖర్చు కూడా హాలీవుడ్ స్థాయిలోనే

రోబో ‘2.0' సినిమా ఖర్చు కూడా హాలీవుడ్ స్థాయిలోనే పెట్టారు. ఈ సినిమాకు రూ. 450 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేస్తే..... దాదాపు రూ. 50 కోట్లు కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే ఖర్చు పెడుతున్నారట.English summary
2.0 World Tour Hot Air Balloon - World Tour Launched at Lake Park, Hollywood. 2.0 is an upcoming Indian science fiction film written and directed by S. Shankar, co-written by B. Jeyamohan, and produced by Subaskaran Allirajah, founder of Lyca Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu