వేణుస్వామి, ఆయన భార్యపై 2 కేసులు నమోదు.. 5 కోట్ల వ్యవహారంపై స్పందించిన జర్నలిస్టులు
ప్రముఖ జ్యోతిష్యుడు, వివాదాస్పద వేణు స్వామిపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రోజున ఆయన తన సతీమణితో కలిసి విడుదల చేసిన వీడియో అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణలపై ఖండన విధిస్తూ.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్, టీవీ మూర్తి కేసులు నమోదు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మహా న్యూస్‌లో ఉన్నప్పటి నుంచి తనను టార్గెట్ చేస్తూ 5 కోట్లు డిమాండ్ చేశారు అంటూ ప్రస్తుతం టీవీ 5లో పనిచేస్తున్న మూర్తి, అలాగే వైజే రాంబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. వారి వీడియోలో పేర్కోన్న ఆరోపణలపై స్పందిస్తూ ఖండించారు. అంతేకాకుండా అతడు ఆరోపణలు నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్దమే అని అన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో తమపై అసత్య ఆరోపణలు చేసిన వేణుస్వామిపై తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ సెక్రెటరీ వైజే రాంబాబు, ఈసీ మెంబర్ ప్రసాదం రఘు తాజాగా మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై ఆరోపణలు చేసిన ఆయనపై తగు చర్యులు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి వేణుస్వామిపై టీవీ5 మూర్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఆగస్టు 20వతేదీన వేణు స్వామి, ఆయన భార్య వీణపై కేసు నమోదు చేశాను. వారి ప్రవర్తన భాగాలేదు. వారు చేసిన ఆరోపణలతో మనస్తాపం చెందాను. వాస్తవాన్ని వెలుగులోకి తీసుకు రావడానికి నేను వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశాను అని తెలిపారు.

నాపై వారిద్దరూ తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు చేశారు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేశానని వీడియోలో చెప్పారు. నా నిజాయితీని, నా ప్రతిష్టను భంగపరిచే విధంగా నాపై కేసు నమోదు చేశారు. నా ఫిర్యాదుకు స్పందించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని మూర్తి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.


Click it and Unblock the Notifications











