అక్కడ 100 కోట్లు, తెలుగులో రీమేక్ చేసే ప్లాన్?
హైదరాబాద్: చేతన్ భగత్ నవల ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ '2 స్టేట్స్' ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. అర్జున్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో రూ. 100 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్టయింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి 'పివిపి సినిమాస్' బేనర్లో ఈచిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టరీ మిలితమైన ఫ్యామిలీ సబ్జెక్టు కావడంతో తెలుగు, తమిళంలో మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు రీమేక్ విషయమై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ పివిపి బ్యానర్ నుండి అందలేదు. దర్శకుడు, తారాగణం ఖరారైన తర్వాత పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. తెలుగు, తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోను ఈచిత్రం కోసం తీసుకుంటారని టాక్.
'2 స్టేట్స్' చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 45 కోట్ల వ్యయంతో కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న దాదాపు 2 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసారు. రోనిత్ రాయ్, అమృతా సింగ్, రేవతి, శివకుమార్ సుబ్రమనియన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications