»   » చై-సామ్ రిసెప్షన్: అమ్మ లక్ష్మి కోసం చెన్నైలో.... నాన్న నాగార్జున కోసం హైదరాబాద్‌లో!

చై-సామ్ రిసెప్షన్: అమ్మ లక్ష్మి కోసం చెన్నైలో.... నాన్న నాగార్జున కోసం హైదరాబాద్‌లో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య-సమంత వివాహం ఇటీవల గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు కొందరిని మాత్రమే ఆహ్వానించి సింపుల్‌గా ఈ వేడుక నిర్వహించారు. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో ఈ వేడుక నిర్వహించారు. అయితే ఇపుడు వెడ్డింగ్ రిసెప్షన్ కూడా రెండు సార్లు జరుగబోతోందట.

వాస్తవానికి రిసెప్షన్ చేసుకోవడం చైతన్యకు పెద్దగా ఇంట్రస్టు లేక పోయినా... తన ప్రెస్టీజ్ ఇష్యూ కాబట్టి నాగార్జున ఈ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా తన కుమారుడికి వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అమ్మ లక్ష్మి కోసం చెన్నైలో

అమ్మ లక్ష్మి కోసం చెన్నైలో

అసలు వెడ్డింగ్ రిసెప్షన్ అంటేనే ఇంట్రెస్టు లేని చైతన్య ఇపుడు నాన్న కోసం, అమ్మ కోసం రెండు సార్లు రిసెప్షన్ చేసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం చైతూ తల్లి లక్ష్మి చెన్నైలో ఉంటున్నారట. అక్కడే ఆమె తన సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ను పిలిచి రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం హాజరు కానుందని సమాచారం.

లక్ష్మి దగ్గుబాటి

లక్ష్మి దగ్గుబాటి

ప్రముఖ నిర్మాత డి రామాయుడు కూతురైన లక్ష్మి... నాగార్జునను 1984 పెళ్లాడిన సంగతి తెలిసిందే. చైతన్య పుట్టిన అనంతరం ఇద్దరూ విడిపోయారు. తర్వాత నాగార్జున అమలను పెళ్లాడారు. లక్ష్మీ కూడా శరత్ విజయ్ రాఘవన్ అనే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ను పెళ్లాడారు.

చెన్నైలో ఈ నెలలోనే...

చెన్నైలో ఈ నెలలోనే...

చైతు తల్లి లక్ష్మి నిర్వహించబోయే వెడ్డింగ్ రిసెప్షన్ అక్టోబర్ చివర్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ రిసెప్సన్ సింపుల్‌గా జరుగుతుందని తెలుస్తోంది. డేట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో

నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో

హైదరాబాదులో చైతు తండ్రి నాగార్జున నిర్వహించబోయే రిసెప్షన్ భారీ ఎత్తున జరపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు నాగ్. నవంబర్ మొదటి వారంలోఈ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.

సమంత-చైతు బిజీ బిజీ

సమంత-చైతు బిజీ బిజీ

సమంత, నాగ చైతన్య ప్రస్తుతం బిజీ బిజీగా సినిమా షూటింగులు, ప్రమోషన్లలో గడుపుతున్నారు. అందుకే వెడ్డింగ్ రిసెప్షన్ కాస్త లేటుగా ప్లాన్ చేసుకున్నారు. సమంత నటించిన రాజుగారి గది 2 చిత్రం ఈ రోజు విడుదలవ్వగా, తమిళ చిత్రం మెర్సల్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆమె తెలుగులో ‘రంగస్థలం 1985' అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Naga Chaitanya's mother Lakshmi is reportedly planning to hold the first reception in Chennai as she resides there. It will be a private affair and only her family members and close friends will be invited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X