»   » రెండేళ్ల వయసులో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో తెలుసా? ఫోటో వైరల్...

రెండేళ్ల వయసులో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో తెలుసా? ఫోటో వైరల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన చిన్న నాటి ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. తారక్ 2 ఏళ్ల వయసులో ఉన్నపుడు తీసిన ఫోటో ఇది. ఇప్పటి వరకు అభిమానులు చూడని ఫోటో కావడంతో ఫ్యాన్స్ దీన్ని చూసి మురిసిపోతున్నారు. తన తల్లితో కలిసి దిగిన ఈ ఫోటోలో బుడ్డోడిగా ఎన్టీఆర్ తెగ ముద్దొస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. యంగ్ టైగర్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్ స్లిమ్‌గా, సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

2 years old NTR rare childhood photo

తన కెరీర్లో ఇప్పటి ఎన్టీఆర్ పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. ఎన్టీఆర్ పోషించే పాత్ర హాస్యం పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోందని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తనదైన రచనా శైలితో మరోసారి థియేటర్లో చప్పట్లు కొట్టించబోతున్నాడట.

హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వక పోవడంతో కాస్త డీలా పడ్డ త్రివిక్రమ్ ఈ సినిమాతో మళ్లీ బాక్సాఫీసు వద్ద తన సత్తాచాటుతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
NTR rare childhood Pic goes viral in internet, who is posing with his mother Shalini. Tarak must have been around 2 years old when the picture was clicked.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X