ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది .. అనుపమ ట్వీట్, ఎందుకో తెలుసా!
Recommended Video

ప్రేమమ్ చిత్రంతో మాయచేసిన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో కూడా మాయ చేస్తోంది. క్యూట్ లుక్స్ తో అలరించే అనుపమ తెలుగులో పలు చిత్రాల్లో నటింస్తుంది. అనుపమ నటించిన చిత్రం విజయవంతం అవుతున్నాయి. మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో నటించిన తరువాత అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు అనుపమ పరమేశ్వరన్ నటించిన తొలి చిత్రం అ.. ఆ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి అనుపమ తాజగా ఓ ట్వీట్ చేసింది.

అందమైన సినిమాకు రెండేళ్లు
యద్దనపూడి సులోచనారాణి రాసిన మీన నవల ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అ..ఆ .. చిత్రాన్ని అందంగా తెరకెక్కించారు. ప్రేక్షకుల ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. నితిన్ హీరోగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదలై నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్ లో స్పందించింది.

రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా
ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు ఆద్యంతం అలరిస్తాయి. 'రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది' అని అనుపమ చెప్పిన విపరీతంగా అలరించిన సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ వీడియోని అనుపమ పరమేశ్వరన్ ట్విటర్ లో పోస్ట్ చేసింది.

నాగవల్లిగా అద్భుత నటన
నాగవల్లి పాత్రలో అనుపమ పల్లెటూరి గడసరి పిల్లగా అద్భుతమైన నటన కనబరిచింది. అనుపమ తెలుగులో నటించిన తొలి చిత్రమే ఘనవిజయం కావడం విశేషం.
ఎప్పటికి మరచిపోలేని ఇంట్రడక్షన్
అ.. ఆ .. చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ఇంట్రడక్షన్ లభిస్తే ఎప్పటికి మరిచిపోలేమని తెలిపింది. 2016 జూన్ 2 న విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అనసూయని మరిచిపోలేం
ఈ చిత్రంలో అనసూయ పాత్రలో నటించిన సమంతని మరచిపోవడం కష్టం. సమంత నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. నితిన్, సమంత, అనుపమాతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేసారు.

తేజ్ ఐ లవ్ యూ చిత్రంలో
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తోంది. తేజ్ ఐ లవ్ యూ అనే ఈ చిత్రం కూడా ప్రేమకథగా రాబోతోంది. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











