KGF కంటే హై రేంజ్ లో సలార్.. అందుకు ఉదాహరణ ఇదే
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతాయని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. దర్శకులు కూడా ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లే సాలీడ్ సినిమాలను రెడీ చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సలార్ అనే కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుంది అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది.
కుదిరితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏకంగా 20 మంది అసిస్టెంట్ దర్శకులను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కేవలం తన పర్సనల్ సహయకులే కాకుండా తమిళ్, తెలుగు ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ను కూడా టీమ్ లో చేర్చుకున్నట్లు సమాచారం.

సలార్ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. రోజుకు వందలాది మంది షూటింగ్ లో పాల్గొంటూ ఉంటారు.అంతే కాకుండా చాలా తొందరగా పూర్తి చేయాలి కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రశాంత్ నీల్ 20 మంది ADలను సెట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక అందులో 10మంది ఇంతకుముందు KGF సినిమాకు పనిచేసినవారే అని తెలుస్తోంది. సలార్ సినిమాను KGF కంటే హై రేంజ్ లో రూపోందిస్తున్నారు అని అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక సినిమాలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సినిమా రీమేక్ అని రూమర్స్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయగా వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు. ప్రశాంత్ మొదటి సినిమా ఉగ్రమ్ కాథ ఆధారంగానే సినిమా రానున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటి రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని లాక్ డౌన్ లో రాసుకున్న ఒక డిఫరెంట్ యాక్షన్ కథ సలార్ అని ప్రశాంత్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











