twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం సేవించాడు: సల్మాన్ కేసులో బిగుస్తున్న ఉచ్చు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై మరింతగా ఉచ్చు బిగుసుకుంది. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం తాగి ఉన్నాడని పరీక్షలు నిర్వహించిన నిపుణుల బృందం కోర్టుకు తెలిపింది. సల్మాన్ రక్త నమూనాలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉందని వారు నివేదిక ఇచ్చారు. అతని రక్తంలో మొత్తాదుకు మించి 62 మిల్లీగ్రాముల ఇథైల్ ఆల్కహాల్ ఉందని నివేదికలో పేర్కొన్నారు.

    పన్నెండేళ్ల క్రితం కారుతో నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లి, ఒకరి మృతికి కారణమైన (హిట్‌ అండ్‌ రన్‌)కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2002 సెప్టెంబర్‌ 28న తెల్లవారు జామున బాంద్రాలో బేకరి బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్‌ కారు డ్రైవర్‌ దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

    2002 hit-and-run case: Alcohol content found in Salman Khan's blood was higher than normal

    ముంబై సబ్ అర్బన్ బాంధ్రాలో ఓ బేకరీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. నివేదిక అందడంతో ఈ కేసు విచారణ చివరి అంకానికి చేరుకుందని అంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా సల్మాన్ ఖాన్ స్వయంగా కారు నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని తెలిపారు. సల్మాన్ నేరం చేసాడనడానికి సాక్షాలు బలంగా ఎన్నాయి. ఒక వేళ సల్మాన్ నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష ఖాయం అంటున్నారు.

    English summary
    Bollywood actor Salman Khan's blood had alcohol content after he was made to undergo a test in the 2002 hit-and-run case, according to a chemical analysis expert who testified in a Mumbai Sessions Court on Wednesday. The expert claimed in the court that the alcohol content found in Salman Khan's blood was higher than normal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X