సల్మాన్‌పై అభియోగాలు నమోదు, జైలు తప్పదా?
తదుపరి విచారణ ఆగస్టు 16, 2013కు వాయిదా పడింది. ఈ అభియోగాలతో సల్మాన్ మరింత చిక్కుల్లో పడ్డట్లయింది. ఆయనపై అభియోగాలు రుజువైతే సల్మాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే తదుపరి విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న సల్మాన్ అభ్యర్థనను కోర్టు మన్నించింది.
2002సంవత్సరంలో బాంద్రాలోని ఓ బేకరి ఎదుట నిద్రిస్తున్న జనాలపై సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని కోర్టుకు సమర్పించిన నివేదికలో గతంలో పేర్కొన్నారు.
నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని 'సల్మాన్'పై హత్య కేసు నమోదైంది. పదేళ్లుగా కేసు కేసు విచారణ సాగుతూనే ఉంది. చనిపోయిన వ్యక్తి నిర్లక్ష్యంగా నడుస్తూ కారుకు అడ్డంగా రావడంతోనే మృతి చెందాడని సల్మాన్ తరపున న్యాయవాది వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications












