twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో మూడు వారాలు: ఇదీ సల్మాన్ ఖాన్ కేసు పరిస్థితి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. సెన్షన్ కోర్టు తీరుపై బాంబే హైకోర్టుకు అప్పీల్ చేయగా సల్మాన్ ఖాన్ కు మే 8న బెయిల్ మంజూరు చేసి తదుపరి విచారణ జూన్ 25ను వాయిదా పడింది. తాజాగా కేసు విచారణఖు రాగా తదుపరి విచారణను బాంబే హైకోర్టు జులై 13కు వాయిదా వేసింది.

    సల్మాన్‌ కేసులో సాక్ష్యం చెప్పి ‌బిచ్చమెత్తుకునే స్థితికి...(కన్నీటి గాథ)సల్మాన్‌ కేసులో సాక్ష్యం చెప్పి ‌బిచ్చమెత్తుకునే స్థితికి...(కన్నీటి గాథ)

    కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను, పరిశీలించడానికి మూడు వారాల గడువు కావాలని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సల్మాన్ అభ్యర్థనను తప్పుబట్టారు. మరింత కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు.

    2002 hit-and-run case: Salman Khan's appeal adjourned to July 13

    సెషన్స్ కోర్టు తీర్పు ఇలా...
    హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. మద్యం సేవించి కారు నడిపి ఒకరు మరణించడానికి, పలువురు గాయపడటానికి కారణమైన ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందున మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు.

    కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది.

    English summary
    The Bombay High Court today deferred till July 13 an appeal filed by Bollywood superstar Salman Khan against the five-year sentence awarded to him in the hit-and-run case, after the actor’s lawyer sought time to check documents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X