సల్మాన్‌ను గుర్తించిన సాక్షులు, శిక్ష తప్పదా?
ముంబై: పన్నెండేళ్ల క్రితం కారుతో నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లి, ఒకరి మృతికి కారణమైన (హిట్ అండ్ రన్)కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2002 సెప్టెంబర్ 28న తెల్లవారు జామున బాంద్రాలో బేకరి బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్ కారు డ్రైవర్ దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.
తాజాగా ఈ కేసుకు మంగళవారం ముంబైలోని కోర్టులో విచారణకు వచ్చింది. ఇద్దరు సాక్షులు సల్మాన్ ఖాన్‌ను గుర్తించారు. ఘటన జరిగిన రోజు రాత్రి సల్మాన్‌ను తాము చూశానని, అప్పుడే కారు నుంచి సల్మాన్ బయటికి దిగాడని, అర్థరాత్రి 2.45 సమయంలో ఆ దురదృష్టకర ఘటన జరిగిందని ఇద్దరు సాక్షులు ముస్లిం షేక్ మరియు మున్ను ఖాన్ కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడని వారు తెలిపారు.

సెప్టెంబర్ 28, 2002లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో నడుపుతూ సల్మాన్ ఖాన్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న కొంతమంది వ్యాక్తులపైకి వాహనం ఎక్కించారనే ఆరోపణలతో ఈ కేసు సాగుతోంది. ముంబై సబ్ అర్బన్ బాంధ్రాలో ఓ బేకరీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
సెప్టెంబర్ 2, 2005లో కేసు విచారణ మొదలయ్యింది. 2006లో 39 మంది సాక్షలను విచారించిన న్యాయస్థానం, అక్టోబర్ 6, 2006లో బంద్రా కోర్టు సల్మాన్‌పై పది నేరాభియోగాలు నమోదు చేసింది. 2013 జులై 24న ఆయన శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ముంబయి న్యాయస్థానం నిర్ధారించింది. బాంద్రా కోర్టు నిర్ణయం ప్రకారం ఐపీసీ 304 (ఏ) ప్రకారం సల్మాన్‌కు రెండేళ్ల శిక్షక అర్హుడవుతారని నిర్ణయించారు. అయితే బాంద్రా కోర్టు నిర్ణయంపై సల్మాన్ ఖాన్ ముంబయి కోర్టును ఆశ్రయించారు.
ముంబయి కోర్టు నేరాభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా తానేతప్పు చేయలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో డిసెంబర్ 5వ తేదీన ఈ కేసును పూర్తిగా పునర్విచారణ చేపట్టాలని ముంబయి కోర్టు ఆదేశించింది. పునర్విచారణలో సల్మాన్ ఖాన్‌ను సాక్షులు గుర్తించారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోష నిర్థారణ అయినట్లయితే సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.


Click it and Unblock the Notifications











