»   »  నేడే తీర్పు : సల్మాన్‌కు పదేళ్ల జైలు శిక్ష తప్పదా?

నేడే తీర్పు : సల్మాన్‌కు పదేళ్ల జైలు శిక్ష తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' జైలుకు వెళతాడా ? లేడా ? అన్న దానిపై బాలీవుడ్ లో తెగ చర్చ జరుగుతోంది. ఈ రోజే తీర్పు వెలువడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 2002సంవత్సరంలో బాంద్రాలోని ఓ బేకరి ఎదుట నిద్రిస్తున్న జనాలపై సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని 'సల్మాన్'పై హత్య కేసు నమోదైంది. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతోంది. చనిపోయిన వ్యక్తి నిర్లక్ష్యంగా నడుస్తూ కారుకు అడ్డంగా రావడంతోనే మృతి చెందాడని సల్మాన్ తరపున న్యాయవాది వాదించారు. 'సల్మాన్'పై నేరం రుజువైతే మాత్రం పది సంవత్సరాల జైలు శిక్ష పడేది ఖాయమని న్యాయవాదులు పేర్కొంటున్నారు.

నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణమైనందున ఐపీసీ 304ఏ సెక్షన్‌ కింద సల్మాన్‌ను తొలుత మేజిస్ట్రేట్‌ విచారించిన సెక్షన్‌ కింద అతనికి దాదాపు రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉండేదని వాదోపవాదాలకు అవకాశమివ్వాలంటూ సల్మాన్‌ న్యాయవాది రాతపూర్వకంగా విన్నవించారు. కానీ ఈ సంవత్సరం జనవరిలో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ 17 మంది సాక్షులను విచారించిన అనంతరం కేసు తీవ్రమైందిగా పరిగణించారు.

కానీ శిక్షించదగిన హత్యా నేరమని (ఐపీసీ సెక్షన్ 304 పార్ట్-2) స్థానిక కోర్టు ఆరోపణలు మోపడాన్ని సవాల్ చేస్తూ సల్మాన్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన కేసు జూన్ 10న విచారణ జరుగాల్సి ఉండగా నగరంలో కురిసిన భారీ వర్షం వల్ల కోర్టు సిబ్బంది హాజరుకాలేదు. దీనికితోడు ఈ కేసు తీర్పును వాయిదా వేయాలని సల్మాన్ తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు కేసు తీర్పును ఈరోజు(జూన్ 24)కు వాయిదా వేసారు. ఎలాంటి తీర్పు వెలువడుతుందో అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary

 Today, a Mumbai session court is likely to give verdict on Salman Khan's infamous 2002 hit and run case. The court will decide whether or not the actor should be punished for culpable homicide not amounting to murder. If convicted for this charge Salman Khan will have to got to jail for ten years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu