ఈ సంవత్సరం ఉత్తములు వీరే...!!

By Sindhu

ఉత్తమ నటుడు: రామ్ చరణ్ తేజ్ 'చిరుత" చిత్రం ద్వారా చిరు తనయుడి తెరంగ్రేటం చేసిన ఈ చిచ్చర పిడుగు రెండో చిత్రంతోనే రికార్డు స్థాయి విజయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ తో 'మగధీర" సాదించాడు. ముఖ్యంగా ఈ చిత్రంతో రామ్ చరణ్ డాన్స్ లలో, ఫైట్స్ లలో తన నటన ఏపాటిదో చూపారు. తన తండ్రి నర్తించిన 'బంగారు కోడి పెట్ట" కు రీమిక్స్ చేసిన పాటలో తన డాన్స్ టాలెంట్ ను చూపాడు. అలాగే ఆ పాట అయిపోయాక చిరంజీవితో చిరు సన్నివేశంలో నటించి తన తండ్రితో నటించిన ఘనతను పొంది తమ మెగాభిమానులకు మెగానందాన్ని కలిగించాడు.

ఉత్తమ నటి : అనుష్క 'సూపర్" చిత్రం ద్వారా నాయికగా పరిచయమై రాజమౌళి-రవితేజల చిత్రం 'విక్రమార్కుడు" తో స్టార్ డమ్ ను పోందిన ఈమె చిరుతో 'స్టాలిన్" చిత్రంలో ఐటం సాంగ్ లో కనిపించి మెప్పించింది. బాలయ్యతో 'ఒక్క మగాడు", నాగ్ తో 'సూపర్, డాన్", వెంకీతో 'చింతకాయల రవి" చిత్రాలలో నటించి ఆయా హీరోల అభిమానుల అభిమానాన్ని అవలీలగా చూరగొంది. ఈ సంవత్సర ప్రారంభంలో వచ్చిన 'అరుంధతి" చిత్రంలో జేజమ్మగా ఆమె చూపిన నటన అందరినీ అలరించింది. ఈమె ఈ సంవత్సరానికే ఉత్తమ నాయికగా నిలిచింది. ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి: స్లో పాయిజన్ లాంటి మ్యూజిక్ నిచ్చి మెప్పించే సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. మెలోడీలను ఇవ్వడంలో ఘనాపాటిగా పేరుతెచ్చుకున్న కీరవాణి ఈ సంవత్సరం 'వెంగమాంబ", 'మగధీర", 'ప్రవరాఖ్యుడు" చిత్రానికి అందించిన బాణీలు తిరుగులేని హిట్ గా నిలిచాయి. ఈ చిత్ర ఆడియో విడుదలైన కొత్తల్లో డివైడ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఇందులోని అన్ని పాటలు పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ మెప్పించాయి.

ఉత్తమ నిర్మాత: ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి: రాజీపడటం అంటే ఏంటో తెలియని నిర్మాత ఎవరైనా మన తెలుగు చిత్ర సీమలో ఉన్నారంటే అది తప్పకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డినే అయివుంటాడనేది సినీ జగమెరిగిన సత్యం. తను అనుకున్నది ఫర్ ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ కారు. ఏడేళ్ళ పాటు సుదీర్ఘంగా నిర్మాణం జరుపుకున్న చిరంజీవి చిత్రం 'అంజి" కావచ్చు, సౌందర్య నాయికగా వచ్చిన 'అమ్మోరు" కావచ్చు. 'అరుందతి" సినిమా కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా దర్శకుడి గురించి వదిలేసి చాలా వరకు నిర్మాత గురించే మాట్లాడుకున్నారంటేనే అర్ధమవుతుంది. ఈ చిత్రం ద్వారా శ్యామ్ ఎలాంటి ఖ్యాతీ పొందారో తెలుస్తుంది.

ఉత్తమ దర్శకుడు: రాజమౌళి - ఇప్పుడున్న దర్శకులలో ప్రేక్షకనాడి తెలిసిన దర్శకుడిగా రాజమౌళికి మంచి పేరుంది. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలలో అపజయం అంటే ఏమిటో చూడలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు అతని టాలెంట్ ను అలాగే ఆడియన్స్ పల్స్ పట్టడంలో ఆయనది నేర్పైన శైలి. ఈయన దర్శకత్వం వహించిన 'మగధీర" చిత్రం గత రికార్డులను తిరగ రాసింది. 'స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ" చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న ఆయన సెవెన్త్ వండర్ గా ఈ చిత్రాన్ని మలచడమే కాకుండా దర్శకునిగా తన ప్రతిభను మరోసారి లోకానికి చాటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X