twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2010 సినిమా పోల్: ఓటు వేసి, ఫలితాలు చూడండి

    By Srikanya
    |

    ,p>తెలుగు చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నో ప్లాపులు, కొద్ది పాటి హిట్స్, సమ్మెలు, వివాదాలుతో గడిచిపోయింది. క్రమశిక్షణకు మారు పేరుగా పేరు తెచ్చుకున్న ఈ పరిశ్రమ నిర్మాతని క్యాషియర్ గా చేసి సినిమాలు నిర్మింప చేస్తూ అతన్ని ప్రపోజల్ మేకర్ గా మార్చేసింది. దాంతో వారంతా ఫైటర్స్ సమ్మె పుణ్యమా అని ఒక్కటై, షూటింగ్స్ ని ప్రక్కన పెట్టి హీరోల రెమ్యునేషన్స్ మొదలుకుని రకరకాల సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. పెద్ద హీరోలు సైతం తాము ఎక్కువ సినిమాలు చేస్తామని, రెమ్యునేషన్స్ తగ్గించుకుంటామని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరో ప్రక్క నిర్మాతలు సైతం డబ్బింగ్ సినిమాలను నిషేధించాలి అంటూనే ఇతర భాషా దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ పరిశ్రమనే నమ్ముకుని పనిచేసే వారిని సమస్యల్లోకి నెడుతున్నారు. తమ సినిమాలు పైరసీ చేసేస్తున్నారు అని యుద్దం ప్రకటిస్తూనే యధేచ్చగా ఇతర భాషా చిత్రాల కాపీలని ప్రోత్సహిస్తున్నారు. ఇలా మారుతున్న పరిశ్రమ సినేరియాకు తగినట్లుగా ప్రేక్షకులు సైతం తమ తీర్పుని విభిన్నంగా ప్రకటిస్తూ మూస సినిమాలను తిప్పి కొడుతూ..కొత్తదనానికి జై కొడుతున్నారు. అలాగే సినిమాలు ప్లాప్ అయినా హిట్ అని ప్రచార మాధ్యమాల్లో యాధాశక్తి ప్రచారం చేస్తూంటే చూస్తూ నవ్వుకుంటున్నారు.

    ఈ స్థితిలో 2010 సంవత్సరంలో ఏ సినిమాలు హిట్, ఏవి కావు, ఎవరు పెద్ద హీరో, ఎవరు లీడింగ్ హీరోయిన్ వంటి విషయాలపై మీ అభిప్రాయాలకు అణుగుణంగా మీరు ఓటు చేయవచ్చు. ఇందుకు సంబంధించి వన్ ఇండియా తెలుగు ఓ పోల్ నిర్వహిస్తోంది. ఈ ఓటింగ్ ఫలితాలను డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తాం.

    English summary
    2010 Cinema Polls: Vote for your choice
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X