twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2010లో ఆ చిత్రాలదే హవా అంతా!?

    By Srikanya
    |

    లీడర్
    అవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెడీ అయిన లీడర్ చిత్రం. రామానాయుడు మనవడు రాణా ఈ చిత్రం ద్వారా పరిచయం అవటం ఒకెత్తు అయితే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం చేసిన చిత్రం ఇదే కావటం మరో కారణం.ఎ.వియం బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం పొలిటకల్ ధ్రిల్లర్ గా సాగుతుందని తెలుస్తోంది.

    అదుర్స్
    ఇక ఆ తర్వాత అందరి కళ్ళూ అదుర్స్ చిత్రంపై ఉన్నాయి. ఆది,సాంబ చిత్రాల అనంతరం వివివినాయిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నయనతార,షీలా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

    కేడీ
    ఇక ప్రతీ డిసెంబర్ కీ సినిమాలు రిలీజ్ చేస్తున్న నాగార్జున ఈ సారి లేటయ్యారు. కేడీ టైటిల్ తో కిరణ్ అనే నూతన దర్శకుడుని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. మమతా మోహన్ దాస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    నమో వెంకటేశ
    ఆ తర్వాత శ్రీనువైట్ల,వెంకటేష్ కాంబినేషన్ లో రెడీ అయిన నమో వెంకటేశ చిత్రం గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. పూర్తి కామిడీగా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష చేస్తోంది. ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రం తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోండటంతో మంచి అంచనాలు ఉన్నాయి.

    శంబో శివ శంభో
    రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కాంబినేషలో క్రేజీగా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ హిట్ నాడోడిగల్ రీమేక్ గా వస్తున్నఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. తమిళ ఒరిజనల్ రూపొందించిన సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించటం ఈ చిత్రానికి పెద్ద ప్లస్. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

    వేదం
    గమ్యం చిత్రంతో తెలుగు సినిమాను ఉలిక్కిపడేలా చేసిన క్రిష్ తదుపరి చిత్రం వేదం పై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ అల్లు అర్జున్,అనూష్క, మంచు మనోజ్ ,శియా కాంబినేషన్లో రావటం ఈ చిత్రానికి మరో ఆకర్షణ.

    కొమరం పులి
    2008 లో వచ్చిన జల్సా తర్వాత పవన్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం కొమురం పులి. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రెడీ అవుతున్నఈ చిత్రం ఈ వేసవికి రెడీ అవుతోంది. ఎ.ఆర్.రహమాన్ సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. పవన్,ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో గతంలో ఖుషి సినిమా మెగా హిట్ అవటంతో ఈ చిత్రంపై రోజు రోజుకీ అంచనాలు పెర్గుతున్నాయన్నది నిజంయ

    కిలాడి
    మహేష్ బాబు అతిధి చిత్రం అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ చిత్రం ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించటం,అనూష్క కాంబినేషన్ ఈ చిత్రాన్ని హాట్ ప్యాకేజీగా మార్చేసాయి. అందులోనూ త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్ లో అతడు చిత్రం రావటం కూడా ఈ చిత్రంపై హైప్ పెరగటానికి మరో కారణం.

    ఆరంజ్
    రామ్ చరణ్ తేజ,బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. మగధీర వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం కావటంతో మంచి ఓపినింగ్స్ ఉంటాయి. అలాగే యూత్ లో క్రేజ్ ఉన్న జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. 2010 సంవత్సరాంతంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    మర్యాద రామన్న
    మగధీర వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి,కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి చేస్తున్న ఈ చిత్రం పై కూడా అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. సునీల్ హీరోగా చేసిన అందాల రాముడు హిట్టవటం ఈ చిత్రానికి ప్లస్ అవుతోంది. అలాగే అపజయమెరగని రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందటమే ఈ చిత్రానికి ఉన్న మరో మెగా ప్లస్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X