ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏటా జరిపే ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుల వేడుక ఈ సంవత్సరం కూడా వైభవంగా జరిగింది. తెలుగు వారి కొత్త సంవత్సరమైన 'విజయ' నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నంది బహుమతుల ప్రదానోత్సవం - 2011' జరిగింది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ 2011 వ సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. లలిత కళా తోరణంలో అట్టహాసంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి అమితాబ్ స్వయంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అవార్డును అమితాబ్‌కు అందజేశారు.
తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అని తెలుగులో శుభాకాంక్షలు అందిస్తూ అమితాబ్ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్ పేర నెలకొల్పిన జాతీయ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు, ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని శ్లాఘిస్తూ ఆయన బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారిమని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
నంది అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో జ్యోతి వెలిగిస్తున్న సీఎం కిరణ్, అమితాబ్ తదితరులు...

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
మహేష్ బాబుకు బ్యాడ్జి పెడుతున్నరాజశేఖర్

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాగార్జున, సత్యనారాయణ

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
అమితాబ్ కి ఒక పక్కన కిరణ్ రెడ్డి, మరో పక్కన మహేష్ బాబు

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీ తారల తళుకుబెలుకులు

ఫోటోలు : నంది అవార్డుల ప్రదానోత్సవంలో బిగ్ బి, మహేష్ బాబు
కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన
సినిమా అనేది దేశం మొత్తాన్ని ఏకం చేయగలిగినంత శక్తిమంతమైనదంటూ దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవాళ్లమంతా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా జోక్ వస్తే ఒకే రకంగా నవ్వుతామని, అలాగే హృదయాన్ని కదిలించే దృశ్యాలు వచ్చినప్పుడు అదే విధంగా కన్నీరు కారుస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అవార్డు ఇచ్చిన తెలుగువారికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని ఆయన సినిమా అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన తారలు అందరూ దిగివచ్చారు. అక్కినేని నాగార్జున, మహేశ్‌బాబు, కైకాల సత్యనారాయణ, నయనతార, మంచు లక్ష్మి, శ్యాంబెనగల్, నిర్మాత ఆదిశేషగిరిరావు, మహేష్ బాబు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు ప్రభృతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click it and Unblock the Notifications