twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2012 సంక్రాంతి రిలీజ్ లు ఇవే

    By Srikanya
    |

    సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండగ. చాలా సినిమాలు అప్పుడే విడుదల చేయటానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తూంటారు. ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ లు అప్పుడే పెట్టుకోవాలని ఆసక్తి చూపుతూంటారు. ఈ నేపధ్యంలో 2012 సంక్రాంతికి కూడా తెలుగు సినిమాలు బారులు తీరనున్నాయి. సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవటానకి పెద్ద హీరోలు ముస్తాబవుతున్నారు. అవి ఏమిటంటే..బాలకృష్ణ హీరోగా ఎం.ఎల్‌పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న అది నాయకుడు చిత్రం. ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అలాగే ఆ తర్వాత దూకుడుతో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మహేష్‌బాబు సంక్రాంతికి 'బిజినెస్ మ్యాన్'గా రానున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.పోకిరి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

    అ తర్వాత రాఘవ లారెన్స్ దర్శకత్వంలో జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం 'రెబెల్'. ప్రభాస్, తమన్నా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'నిప్పు'ను కూడా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మ్యాక్స్ ఇండియా పతాకంపై అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూల రంగడు' కూడా ముగ్గుల పండక్కి విడుదల కానుంది. సునీల్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని అహనా పెళ్లంట చిత్రంతో విజయం సాధించిన వీరభద్ర చౌదరి డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'లవ్‌లీ'. బి.ఎ.రాజు నిర్మాత. జయ.బి. దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ప్రధాన పాత్రలో డా.రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఆది, శాన్వి హీరో,హీరోయిన్స్ గా చేస్తున్న ఈచిత్రాన్ని జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి వీరిలో సంక్రాంతి విజేత ఎవరో చూడాల్సిందే.

    English summary
    Balakrishna New Movie Under Paruchuri Murali direction has been scheduled for Pongal release on January 12, 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X