మహేష్ బాబు, బాలకృష్ణ -రవితేజల మధ్య వార్..!?
తెలుగు బడా హీరోలు సంక్రాతి యుద్ధానికి శంఖం పూరిస్తున్నారు. టాప్ హీరోలు తమ చిత్రాల రిలిజ్ డేట్స్ ని ఎనౌన్స్ చేస్తున్నారు. సంక్రాంతి పందెంలో పోటీ పడేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఒక్కొక్కరుగా సంక్రాతి రాజు పోటీకి సిద్ధమౌతున్నారు. ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. అధినాయకుడు చిత్రంతో బాలకృష్ణ, ది బిజినెస్ మేన్ సినిమాతో మహేష్ బాబు, నిప్పుతో రవితేజ సంక్రాతి పోరుకు రెడీ అవుతున్నారు. రచ్చ చిత్రాన్ని సైతం సంక్రాతికి విడుదల చేయాలనుకుంటున్నా... షూటింగ్ షెడ్యూల్ ను పరిశీలిస్తే.... సంక్రాంతికి వచ్చేలా కనిపించట్లేదు.
దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా అనే వివాదాన్ని పక్కన పెడితే, దూకుడు సినిమా రిజల్ట్ మహేష్‌బాబుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని ఆయన ట్వీట్స్ ద్వారా గమనించవచ్చు. ఆ ఆనందాన్ని మరో సినిమా చాలా తక్కువ టైంలో ఫినిష్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తూ, తెలుగు ప్రేక్షకులను మరోసారి రంజింప చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు అందరి కళ్ళూ మహేష్‌బాబు సినిమా "ది బిజినెస్ మ్యాన్" మీదే వున్నాయి. రామ్ చరణ్ 'రచ్చ" 2012 సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు కాబట్టి..ఇక 2012 సంక్రాంతికి మాహేష్ బాబుతో పోటి పడేది బాలకృష్ణ, రవితేజ. మహేష్‌బాబు "ది బిజినెస్ మ్యాన్", బాలకృష్ణ "అధినాయకుడు" మరియు రవితేజ"నిప్పు". వరుసగా జనవరి 11, 12, 13 తేదిలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ముగ్గురు హీరోల సంక్రాంతి పండగ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే... బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలు సంక్రాతికే వచ్చే ఘనవిజయం సాధించాయి. ఇక మహేష్ కు గతంలో 'ఒక్కడు' సినిమా సంక్రాంతి కాంతులు నింపింది. రవితేజ కృష్ణ చిత్రంతో సంక్రాంతి విజయం పొందాడు. ఇలా ముగ్గురు హీరోలకు సంక్రాంతి అచ్చి వచ్చే పండగే. సంక్రాంతి టైంలో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం మామూలే. సెంటిమెంట్లు ఎలా ఉన్నా ఎవరి చిత్రంపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం కాబట్టి మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.


Click it and Unblock the Notifications











