twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెం.1 ఈగ, నెం.2 గబ్బర్ సింగ్ USA(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమాలకు కొన్ని సంవత్సరాలుగా యూఎస్ఏ మంచి మార్కెట్ గా మారిన సంగతి తెలిసిందే. అత్యధిక మంది తెలుగు వారు అమెరికాలో స్థిరపడటం, చదువులు, ఉద్యోగాల నిమిత్తం లక్షల మధ్య తెలుగు వారు అక్కడి వెళ్లిన నేపథ్యంలో అక్కడ తెలుగు సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. డిమాండ్‌కు తగిన విధంగానే అక్కడ ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.

    ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు అక్కడ కోట్లలో వ్యాపారం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. గత సంవత్సరం అక్కడ మహేష్ బాబు నటించిన 'దూకుడు' లాంటి చిత్రాలు అత్యధిక కలెక్షన్లు సాధించాయి. 2012 సంవత్సరం తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చింది.

    అత్యధిక సంఖ్యలో ఈ సంవత్సరం విడులైన చిత్రాలు విజయం సాధించాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్', కెమెరామెన్ గంగతో రాంబాబు, రాజమౌళి ఈగ, అల్లు అర్జున్ జులాయి, మహేష్ బాబు బిజినెస్ మేన్, రామ్ చరణ్ రచ్చ లాంటి చిత్రాలు ఇక్కడ మంచి కలెక్షన్లు సాధించాయి. 2012 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం అమెరికాలో టాప్-10(కలెక్షన్ల పరంగా)లో నిలిచిన చిత్రాలు ఏమిటనేది ఓ లుక్కేద్దాం.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    ఈగ: రాజమౌళి దర్శకత్వంలో నాని-సమంత జంటగా వచ్చిన ‘ఈగ' చిత్రం అమెరికాలో ఈ సంవత్సరం టాప్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నెం.1 స్థానంలో నిలిచింది. 14 రీల్స్, ఫికస్ సంస్థ ఈచిత్రాన్ని అమెరికాలో సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేసాయి. ఈ చిత్రం టోటల్ గా 10,71,281 యూఎస్ డాలర్లు వసూలు చేసింది.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    గబ్బర్ సింగ్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం కలెక్షన్ల పరంగా 2వ స్థానంలో నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ఈచిత్రం 10,34,484 యూఎస్ డాలర్లు వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్ బ్లూ స్కై.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    జులాయి: ఇక అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' చిత్రం కలెక్షన్ల పరంగా యూఎస్ లో 3వ స్థానంలో నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 8,36,013 యూఎస్ డాలర్లు వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్ ఫికస్ సంస్థ.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    బిజినెస్ మేన్: మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్' చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా 4వ స్థానంలో నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ చిత్రం టోటల్ గా 7,01,053 యూఎస్ డాలర్లు వసూలు చేసింది.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    కెమెరామెన్ గంగతో రాంబాబు: పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కలెక్షన్ల పరంగా ఈ సంవత్సరం 5వ స్థానంలో నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈచిత్రం 6,12,493 యూఎస్ డాలర్లు వసూలు చేసింది. యూనివర్సల్ మీడియా, ప్రణీత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేసారు.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్: ‘హ్యాపీడేస్' ఎఫెక్టుతో శేఖర్ కమ్ముల చిత్రాలకు యూఎస్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం కలెక్షన్ల పరంగా 6వ స్థానంలో నిలిచింది. ఫికస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈచిత్రం 4,25,586 యూఎస్ డాలర్లు వసూలు చేసింది.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    రచ్చ: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ' చిత్రం 3,87,773 యూఎస్ డాలర్లు వసూలు చేసి కలెక్షన్ల పరంగా 7వ స్థానం దక్కించుకుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    దమ్ము: జూఎన్టీఆర్ ‘దమ్ము' చిత్రం 3,04,484 యూఎస్ డాలర్లు రాబట్టి కలెక్షన్ల పరంగా 8వ స్థానంలో నిలిచింది. ఫికస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈచిత్రానకి దర్శకుడు బోయపాటి శ్రీను.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    కృష్ణం వందే జగద్గురుమ్: రాణా నటించి కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం ఇప్పటి వరకు 2,63,253 యూఎస్ డాలర్లు వసూలు చేసి కలెక్షన్ల పరంగా 9వ స్థానంలో నిలిచింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా 7సీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు.

    టాప్-10 తెలుగు మూవీస్ 2012 @ USA(ఫోటో ఫీచర్)

    సుడిగాడు: అల్లరి నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సుడిగాడు చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద టాప్ 10 స్థానం దక్కించుకుంది. ఈచిత్రం ఇక్కడ 2,21,849 యూఎస్ డాలర్లు వసూలు చేసింది. వేద మూవీస్ వారు ఈచిత్రాన్ని ఇక్కడ విడుదల చేసారు.

    English summary
    2012 Telugu Top 10 movies at USA-Boxoffice: Here is the list of top 10 grossers of Telugu cinema in USA for the year 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X