»   » 2014 ఫస్టాఫ్...టాలీవుడ్ హిట్లు ప్లాపులు (ఫోటో ఫీచర్)

2014 ఫస్టాఫ్...టాలీవుడ్ హిట్లు ప్లాపులు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పుడే 2014 సంవత్సరంలో ఆరు నెలలు గడిచి పోయాయి. మరి గడిచిన ఆరు నెలల్లో టాలీవుడ్ పరిస్థితి ఏమిటి? ఎన్ని సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు హిట్ కొట్టాయి. ఎన్ని సినిమాలు నష్టపోయాయి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

గడిచిన ఆరు నెలల్లో తెలుగు సినిమా పరిశ్రమ నుండి దాదాపు 50 సినిమాల వరకు వచ్చాయి. అయిందులో పెద్ద సినిమాల విషయానికొస్తే నాలుగు సినిమాలు భారీ విజయాలు సాధించగా...మరో నాలుగు సినిమాలు యావరేజ్ విజయం సాధించాయి. అదే సమయంలో చిన్న సినిమాలు సత్తా చాటాయి. గతేడాది ఫస్టాఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫస్టాఫ్‌లో ఫలితాల శాతం పెరిగింది.

ఈ సంవత్సరం ఆరంభంలోనే 'ఎవడు' సినిమాతో టాలీవుడ్లో తొలి హిట్ నమోదు చేసాడు రామ్ చరణ్. కొంచెం మిక్డ్స్ టాక్ వచ్చినా సినిమా కమర్షియల్‌గా హిట్టయింది వరల్డ్ ఈ చిత్రం దాదాపుగా రూ. 45 కోట్లపైనే వసూలు చేసింది. అదే ఈ సంవత్సరం ఆరంభంలో భారీ ప్లాపు నమోదు చేసాడు మహేష్ బాబు. ఆయన నటించిన 'నేనొక్కడినే' చిత్రం నిర్మాతలకు భారీ భారీ నష్టాలను మిగిల్చింది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సగం కూడా తిరిగి రాలేదని టాక్. ఇక ఫస్టాఫ్‌లో భారీ విజయం సాధించి, అత్యధిక వసూళ్లు సాధించి నెం.1 స్థానంలో నిలిచిన చిత్రం అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రేసుగుర్రం' చిత్రం. ఈచిత్రం దాదాపు రూ. 55 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

మరో వైపు చాలా కాలం తర్వాత నందమూరి నటసింహం బాలయ్య బాక్సాఫీసు వద్ద గర్జించారు. ఆయన నటించిన లెజెండ్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసింది. ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్ల వరకు వసూలు చేసింది. మరో వైపు లక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం విజయం సాధించి రూ. 38 కోట్ల వరకు వసూలు చేసింది.

ఈ సంవత్సరంలోనూ నితిన్ జోరు కొనసాగించింది. నితిన్-పూరి కాంబినేషన్లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక అల్లరి నరేష్ నటించిన లడ్డూ బాబు, జంప్ జిలానీ చిత్రాలు నిరాశను మిగిల్చాయి. ఇక మరో యంగ్ హీరో నాని కూడా వరుస పరాజయాలు చవి చూసాడు. ఆయన నటించిన 'పైసా', 'ఆహా కళ్యాణం' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయ్యాయి. సునీల్ నటించిన 'భీమవరం బుల్లోడు' యావరేజ్ టాక్‌తో గట్టెక్కింది.

ఎన్నికల సమయంలో...పొలిటికల్ ఎంటర్టెనర్‌గా వచ్చిన నారా రోహిత్ 'ప్రతినిధి' చిత్రం మంచి విజయం సాధించింది. మరో వైపు సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' చిత్రం కూడా పెట్టుబడికి రెండింతలు రాబట్టింది. అయితే మంచు ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'పాండవులు పాండవులు తుమ్ముద' ఆశించిన ఫలితాలు రాబట్టలేదని టాక్. ఈ సంవత్సరం అపజయం పాలైన మరో చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'అనామిక'. వర్మ, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'రౌడీ' చిత్రం కమ్షియల్‌గా ఫర్వాలేదనిపించింది. ఇక హీరో ఆదికి 'ఎప్యార్ మే పడిపోయానే' చిత్రం కలిసి రాలేదు

ఇక ఇటీవల విడుదలైన నాగ చైతన్య 'ఆటోనగర్ సూర్య' యావరేజ్ టాక్‌తో రన్ అవుతోంది. మరో వైపు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసింది.

రేసు గుర్రం

రేసు గుర్రం


అల్లు అర్జున, శృతి హాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేసుగుర్రం' ఈ చిత్రం బారీ విజయం సాధించి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వచ్చిన చిత్రాల్లో నెం. 1 పొజిషన్లో నిలిచింది. ఈ చిత్రం రూ. 55 కోట్లపైగా వసూలు చేసింది.

ఎవడు

ఎవడు


ఈ ఏడాది తొలిహిట్ రామ్ చరణ్ నమోదు చేసాడు. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన ‘ఎవడు' చిత్రం కమర్షియల్‌గా హిట్టయింది.

లెజెండ్

లెజెండ్


చాలా కాలం తర్వాత బాలయ్య ‘లెజెండ్' సినిమాతో విజయం అందుకున్నారు. ఈచిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

మనం

మనం


అక్కినేని మల్టీ స్టారర్ మూవీ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ప్రేక్షకులను ఈచిత్రం బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్వకత్వం వహించారు.

పెద్ద ప్లాప్ ‘1-నేనొక్కడినే'

పెద్ద ప్లాప్ ‘1-నేనొక్కడినే'


మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘1-నేనొక్కడినే' చిత్రం భారీ పరాజయం పాలైంది.

హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్' చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ప్రతినిది

ప్రతినిది


ఓన్నికల వేళ నారా రోహిత్ హీరోగా వచ్చిన పొలిటికల్ ఎంటర్టెనర్ ‘ప్రతినిధి' విజయం సాధించింది. నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.

కొత్త జంట

కొత్త జంట


ఇక మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘కొత్త జంట' ఫర్వాలేదనిపించింది.

హృదయ కాలేయం

హృదయ కాలేయం


సంపూర్ణేష్ బాబు హీరోగా స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన హృదయ కాలేయం పెట్టిన పెట్టుబడికి రెండింతలు వసూలు చేసింది.

ఊహలు గుసగుసలాడే

ఊహలు గుసగుసలాడే


అవసరాల శ్రీనివాస్ దర్వకత్వంలో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే' చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో దూసుకెలుతోంది.

భీమవరం బుల్లోడు

భీమవరం బుల్లోడు


భీమవరం బుల్లోడు చిత్రం బి, సి సెంటర్లలో ఆడటంతో గట్టెక్కింది. ఈ చిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకుడు, ఏస్తర్ హీరోయిన్

English summary
Special article on 2014 First Half Tollywood Hits and Flops.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu