»   » 2016: ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ 10 హిట్స్ ఇవే..(లిస్ట్)

2016: ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ 10 హిట్స్ ఇవే..(లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించిన హిట్స్, ప్లాప్స్ లెక్కలు తెలుసుకోవడం ఎప్పటికీ ఆసక్తికరమే. 2016 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయి. మరి ఇప్పటి వరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని భారీ ప్లాప్ అయ్యాయి.

అయితే గతేడాదిని తలదన్నే హిట్స్ మాత్రం ఈ తొలి 5 నెలల్లో రాలేదు. గతేడాది బాహుబలి, శ్రీమంతుడు లాంటి భారీ వసూళ్లు సాధించిన సినిమాలు వచ్చాయి. ఆ రేంజి హిట్స్ లేక పోయినా ఈ ఏడాది మాత్రం కొన్ని భారీ ప్లాపులు మాత్రం నమోదయ్యాయి. అందులో బ్రహ్మోత్సవం నెం.1 స్థానంలో ఉంది.

ఈ ఐదు నెలల కాలంలో వసూళ్ల పరంగా నెం.1 స్థానంలో ఉన్న చిత్రం మాత్రం అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రమే. ఈ చిత్రం ఇప్పటి వరకు 2016లో టాలీవుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రం 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

గడిచిన ఐదు నెలల్లో ఇప్పటి వరకు టాలీవుడ్ హిట్ చిత్రాల్లో టాప్ 10 పొజిషన్లో ఉన్న సినిమాల వివరాలు స్లైడ్ షోలో...

సరైనోడు

సరైనోడు


ఈ విషయంలో ఇప్పటి వరకు సరైనోడు చిత్రం టాప్ 10 పొజిషన్లో ఉంది. పెట్టిన పెట్టుబడి, వసూళ్లతో పోలిస్తే దీన్ని సూపర్ హిట్ గా తేల్చారు.

సోగ్గాడే చిన్ని నాయనా

సోగ్గాడే చిన్ని నాయనా


నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ కాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా తేల్చారు.

జంగిల్ బుక్

జంగిల్ బుక్


తెలుగులో విడుదలైన జంగిల్ బుక్ చిత్రం కూడా ఇక్కడ విడుదల చేసిన పంపిణీ దారులకు మంచి లాభాలు తెచ్చి పెట్టి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో నిలిచింది.

నేను శైలజ

నేను శైలజ


రామ్ నటించిన నేను శైలజ చిత్రం సూపర్ హిట్ గా నాలుగో స్థానంలో ఉంది.

ఎక్స్ ప్రెస్ రాజా

ఎక్స్ ప్రెస్ రాజా


శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా సూపర్ హిట్ అయి ఐదో స్థానంలో ఉంది.

ఈడో రకం ఆడో రకం

ఈడో రకం ఆడో రకం


కామెడీ బాగా పండటంతో ‘ఈడో రకం ఆడో రకం' చిత్రం కూడా సూప్ హిట్ చిత్రంగా నిలిచి ఆరో స్థానంలో ఉంది.

క్షణం

క్షణం


క్షణం సినిమా కూడా పెట్టిన పెట్టుబడి కంటే బాగా రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

బిచ్చగాడు

బిచ్చగాడు


తమిళ డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు కూడా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువగా రాబట్టి సూపర్ హిట్ అయింది.

ఊపిరి

ఊపిరి


ఊపిరి సినిమాకు మంచి టాకే వచ్చినా...పెట్టిన పెట్టుబడి ఎక్కువగా ఉండటంతో లాభాలు ఎక్కువగా రాలేదు. ఇది జస్ట్ హిట్ గా 9వ స్థానంలో ఉంది.

సుప్రీమ్

సుప్రీమ్


సుప్రీమ్ చిత్రం హిట్ అయి 10వ స్థానంలో ఉంది.

English summary
Tollywood has delivered 10 solid hits. That's really impressive considering close to 10% success rate in the Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu