»   » ఎన్టీఆర్ స్పీడు, అడుగు దూరమే.... పవన్ కళ్యాణ్ స్థానానికి ఎసరు?

ఎన్టీఆర్ స్పీడు, అడుగు దూరమే.... పవన్ కళ్యాణ్ స్థానానికి ఎసరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాలకు నైజాం ఏరియా తర్వాత అత్యంత ఎక్కువ వసూల్లు సాధించి పెట్టే టెర్రీటరీగా ఓవర్సీస్ మార్కెట్ తయారైంది. గత దశాబ్దకాలం నుండి ఇక్కడ తెలుగు సినిమాల మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. కేవలం ఎన్నారై మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కూడా సినిమాల్లో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారంటే ఇక్కడ సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు ఓవర్సీస్ కింగులుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు మాత్రమే ఉండే వారు. గత కొన్నేళ్లుగా వీరి సినిమాలు మాత్రమే ఇక్కడ బాగా వసూళ్లు సాధిస్తూ వస్తున్నారు. టాప్ 5 లిస్టులో కేవలం వీరు నటించిన సినిమాలు మాత్రమే ఉండేవి.

అయితే వీరిని సవాల్ చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ శరవేగంగా దూసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ మూవీ 'జనతా గ్యారేజ్' ఓవర్సీస్ వసూళ్లలో శరవేగంగా దూసుకెలుతోంది. టాప్-5 స్థానం నుండి పవన్ కళ్యాణ్ ను బయటకు తోసే రేంజిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తోంది. అయితే అది సాధ్యం అవుతుందా? లేదా? అనేది మరో వారంలో తేలిపో నుంది.

ఇప్పటి వరకు ఓవర్సస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల వసూళ్ల లెక్కలపై ఓ లుక్కేద్దాం....

బాహుబలి నెం. 1

బాహుబలి నెం. 1

ఇప్పటి వరకు ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మూవీ రికార్డుల కెక్కింది. ఈ చిత్రం ఫుల్ రన్ లో $6,997,636 (46.88 కోట్లు) వసూలు చేసింది. ఈ వసూళ్ల రికార్డులను ఇప్పట్లో మరే సినిమా అధిగమించేలా లేదు. మళ్లీ బాహుబలి 2 సినిమాకు మాత్రమే ఈ రికార్డును బద్దలు కొట్టే శక్తి ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

శ్రీమంతుడు నెం.2

శ్రీమంతుడు నెం.2

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ ఓవర్సీస్ వసూళ్ల పరంగా నెం.2 స్తానంలో ఉంది. ఈ చిత్రం ఇక్కడ ఫుల్ రన్ లో $2,891,742 (19.37 కోట్లు ) వసూలు చేసింది. సినిమా వచ్చిన లాభాల్లో 20 శాతం ఇక్కడి నుండే వచ్చాయి.

అ...ఆ మూవీ నెం.3

అ...ఆ మూవీ నెం.3

త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆయన ఈ ఏడాది తెరకెక్కించిన అ..ఆ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూల్లు సాధించింది. ఫుల్ రన్ లో $2,44,5037 (16.38 కోట్లు) వసూలు చేసింది. కేవలం త్రివిక్రమ్ మార్కు సినిమా అనే ఒకే ఒక కారణంతో ఈ సినిమాకు ఇన్ని వసూళ్లు వచ్చాయి.

నాన్నకు ప్రేమతో మూవీ నెం.4

నాన్నకు ప్రేమతో మూవీ నెం.4

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో మూవీ ఓవర్సీస్ ఏరియాలో మంచి బిజినెస్ చేసింది. ఈ చిత్రం ఇక్కడ ఫుల్ రన్ లో $2,019,418 (13.53 కోట్లు) వసూలు చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఓవర్సీస్ లో ఇన్ని వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. దీంతొ పాటు ఎన్టీఆర్ కోరీర్లో రూ. 50 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రం కూడా ఇదే.

అత్తారింటికి దారేది నెం.5

అత్తారింటికి దారేది నెం.5

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఎంతో క్రేజ్. మరి ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం అంటే ఇంకెంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాల పంటపండించింది. ఈ చిత్రం ఓవర్సీస్ ఫుల్ రన్ లో రూ. $1,897,541 (12.71కోట్లు) వసూలు చేసింది.

జనతా గ్యారేజ్ నెం.6

జనతా గ్యారేజ్ నెం.6

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘జనతా గ్యారేజ్' బాక్సాఫీసును షేర్ చేస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో ఈ మూవీ $1,725,531 (11.5 కోట్లు) వసూలు చేసింది. త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాను పక్కకు నెట్టి టాప్-5 స్థానం ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నెం.7

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నెం.7

మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇక్కడ $1,635,300 (10.95 కోట్లు) వసూళ్లు సాధించింది.

ఊపిరి నెం. 8

ఊపిరి నెం. 8

నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి చిత్రం కూడా యూఎస్ఏలో సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఈ చిత్రం రూ. $1,569,162 (10.51 కోట్లు) వసూలు చేసింది.

దూకుడు మూవీ నెం. 9

దూకుడు మూవీ నెం. 9

మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టెనర్ ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద $1,563,466 (10.47 కోట్లు) వసూలు చేసింది.

మనం మూవీ నెం.10

మనం మూవీ నెం.10

అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం ‘మనం. ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద $1,538,515 (10.30 కోట్లు) వసూలు చేసింది.

English summary
2016 report: Market for Telugu films touched sky in Overseas. Nizam, Andhra and Ceded used to be the money minting areas for Telugu movies but in the past few years Overseas market boomed to unexpected levels.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu