twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2017 ఫోర్బ్స్: సంపాదనలో పవన్, మహేష్‌లను మించిన రాజమౌళి, ప్రభాస్!

    By Bojja Kumar
    |

    ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ 'ఫోర్బ్స్' 2017 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీల వివరాలతో టాప్ 100 లిస్టు విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రూ. 232 కోట్ల సంపాదనతో నెం.1 స్థానంలో నిలిచారు.

    Recommended Video

    టాలీవుడ్ బెస్ట్ అఫ్ 2017

    ఆసక్తికర విషయం ఏమిటంటే... సౌత్ సినీ పరిశ్రమలో అందరికంటే ముందు దర్శకుడు రాజమౌళి ఉన్నారు. ఈ ఏడాది సంపాదన పరంగా ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్లను వెనక్కి నెట్టేశారు. అందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

     నెం.1 స్థానంలో సల్మాన్ ఖాన్

    నెం.1 స్థానంలో సల్మాన్ ఖాన్

    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సంపాదన పరంగా మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సంపాదన రూ. 232 కోట్లు. గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2016లో సల్మాన్ ఖాన్ రూ. 270 కోట్లు సంపాదించారు.

     రెండో స్థానంలో షారుఖ్

    రెండో స్థానంలో షారుఖ్

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రూ. 170 కోట్ల సంపాదనతో రెండవ స్థానంలో ఉన్నారు. గతేడాది షారుక్ సంపాదన రూ. 221 కోట్లు కాగా... ఈ ఏడాది దాదాపు రూ. 50 కోట్ల ఆదాయం తగ్గింది.

     అక్షయ్ కుమార్ సంపాదన

    అక్షయ్ కుమార్ సంపాదన

    ఈ జాబితాలో 3వ స్థానంలో రూ. 100 కోట్ల సంపాదనతో క్రికెటర్ విరాట్ కోహ్లి నిలవగా... 4వ స్థానంలో లక్షయ్ కుమార్ నిలిచారు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ సంపాదన రూ. 98.25 కోట్లు.

     సచిన్ కంటే వెనక పడ్డ అమీర్ ఖాన్

    సచిన్ కంటే వెనక పడ్డ అమీర్ ఖాన్

    బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంపాదన పరంగా ఈ ఏడాది సచిన్ కంటే వెనక పడ్డారు. ఈ ఏడాది రూ. 82 కోట్ల సంపాదనతో సచిన్ 5వ స్థానంలో ఉండగా, రూ. 68.75 కోట్ల సంపాదనతో అమీర్ ఖాన్ 6వ స్థానంలో ఉన్నారు.

    ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా

    ఇండియన్ హీరోయిన్లలో ఈ ఏడాది అందరి కంటే ఎక్కువ సంపాదించిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ ఏడాది ఆమె సంపాదన రూ. 68 కోట్లు. ఓవరాల్‌గా 100 మంది జాబితాలో ఆమె 7వ స్థానంలో ఉంది.

     హృథిక్ రోషన్

    హృథిక్ రోషన్

    బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ రూ. 63.12 కోట్ల సంపాదనతో 9వ స్థానంలో ఉన్నారు. ఆయనకంటే ముందు క్రికెటర్ ధోనీ రూ. 63 కోట్లు సంపాదనతో 8వ స్థానంలో ఉన్నారు.

     10వ స్థానంలో రణవీర్ సింగ్

    10వ స్థానంలో రణవీర్ సింగ్

    ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో 10వ స్థానం బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్‌కు దక్కింది. ఈ ఏడాది అతడి సంపాదన రూ. 62.63 కోట్లు.

     దీపిక పదుకోన్

    దీపిక పదుకోన్

    రణవీర్ సింగ్ తర్వాతి స్థానం అతడి ప్రియురాలు దీపిక పదుకోన్ దక్కించుకోవడం గమనార్హం. ఈ ఏడాది రూ. 59.45 కోట్ల సంపాదనతో దీపిక పదుకోన్ 11వ స్థానంలో నిలిచారు.

     12వ స్థానంలో ఏఆర్ రెహమాన్

    12వ స్థానంలో ఏఆర్ రెహమాన్

    ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ రెహమాన్ 100 మంది జాజితాలో 12వ స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన రూ. 57.63 కోట్లు.

     15వ స్థానంలో రాజమౌళి

    15వ స్థానంలో రాజమౌళి

    ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన వివరాల ప్రకారం సౌత్ సెలబ్రిటీలందరి కంటే దర్శకుడు రాజమౌళి ముందు ఉన్నారు. 100 మంది జాబితాలో ఆయనకు 15వ స్థానం దక్కింది. రాజమౌళి సంపాదన రూ. 55 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. సౌత్ స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి వారి కంటే రాజమౌళి ముందు ఉండటం విశేషం. బాహుబలి సినిమా వల్లే రాజమౌళి ఇంత మొత్తం సంపాదించగలిగారు.

     20వ స్థానంలో అమితాబ్

    20వ స్థానంలో అమితాబ్

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 100 మంది జాబితాలో 20వ స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన రూ. 40 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

     22వ స్థానంలో ప్రభాస్

    22వ స్థానంలో ప్రభాస్

    బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ ఏడాది టాప్ 100 లిస్టులో 22వ స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపాదన రూ. 36.25 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. పవన్, మహేష్ కంటే కూడా ప్రభాస్ ముందు ఉండటం విశేషం. బాహుబలి సినిమా ద్వారా ఆయన ఈ మొత్తం సంపాదించారు.

     25వ స్థానంలో సూర్య

    25వ స్థానంలో సూర్య

    సౌత్ స్టార్ సూర్య ఈ ఏడాది పోర్బ్స్ జాబితాబలో 25వ స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆయన రూ. 34 కోట్లు సంపాదించిటనట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

     27వ స్థానంలో అజిత్

    27వ స్థానంలో అజిత్

    తమిళ స్టార్ అజిత్ 100 మందితో కూడిన జాబితాలో 27వ స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆయన రూ. 31.75 కోట్లు సంపాదించిట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

     31వ స్థానంలో విజయ్

    31వ స్థానంలో విజయ్

    తమిళ స్టార్ విజయ్ 100 మందితో కూడిన ఫోర్బ్స్ జాబితాలో 31వ స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపాదన ఈ ఏడాది రూ. 29 కోట్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

     36వ స్థానంలో రానా దగ్గుబాటి

    36వ స్థానంలో రానా దగ్గుబాటి

    తెలుగు స్టార్ రానా దగ్గుబాటి ఈ ఏడాది రూ. 22 కోట్లు సంపాదించారట. 100 మంది లిస్టులో రానా 36వ స్థానంలో ఎన్నారు. పవన్, మహేష్ ఆయనకంటే వెనకే ఉండటం గమనార్హం.

    37వ స్థానంలో మహేష్ బాబు

    37వ స్థానంలో మహేష్ బాబు

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లిస్టులో 37వ స్థానంలో ఉన్నారు. ఆయన ఈ ఏడాది రూ. 19.63 కోట్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

     69వ స్థానంలో పవన్ కళ్యాణ్

    69వ స్థానంలో పవన్ కళ్యాణ్

    టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్టులో చాలా వెనక ఉన్నారు. 69వ స్థానంలో ఉన్న ఆయన రూ. 11.33 కోట్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

     81వ స్థానంలో అల్లు అర్జున్

    81వ స్థానంలో అల్లు అర్జున్

    ఫర్బ్స్ విడుదల చేసిన 100 మంది లిస్టులో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా చోటు దక్కింది. ఆయన రూ. 7.74 కోట్ల సంపాదనతో 81వ స్థానంలో ఎన్నారు.

     ఇతర సౌత్ స్టార్లు

    ఇతర సౌత్ స్టార్లు

    100 మందితో కూడిన ఈ జాబితాలో ధనుష్ రూ. 11.25 కోట్లు సంపాదనతో 70వ స్థానంలో, మోహన్ లాల్ రూ. 11.03 కోట్లు సంపాదనతో 73వ స్థానంలో, దుల్కర్ సల్మాన్ రూ. 9.28 కోట్లు సంపాదనతో 79వ స్థానంలో ఉన్నారు.

    English summary
    Superstar Salman Khan has once again maintained the top spot in Forbes India Celebrity 100 list for the second consecutive year. The ‘Badshah’ of Bollywood Shah Rukh Khan and India’s cricket captain Virat Kohli took the second and third spot respectively with actor Priyanka Chopra named as only female celebrity in top 10 list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X