twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ హాట్ టాపిక్... సినీ ప్రముఖులపై కేసులు ఏమైనట్లు?

    |

    Recommended Video

    మళ్ళీ తెర మీదకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఛార్జ్ షీట్ లో ఎవరి పేరు ఉందంటే? || Filmibeat Telugu

    తెలుగు సినిమా పరిశ్రమను 2017లో డ్రగ్స్ కేసు షేక్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ, పూరి జగన్నాథ్‌, తరుణ్, నవదీప్, చిన్నా, ఛార్మి కౌర్, శ్యామ్ కె నాయుడు, తనీష్‌, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను సైతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) విచారించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

    ఈ కేసు విచారణ కోసం అప్పట్లో తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ముమైత్ ఖాన్‌ను షో నుంచి బయటకు రప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఈ డ్రగ్ కేసు టాలీవుడ్లో కనుమరుగైంది. ఎంతో మంది సీని ప్రముఖులను విచారించిన పోలీసులు చివరకు ఏం తేల్చారనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రజలు కూడా ఆ కేసు గురించి మరిచిపోయారు.

    సమాచార హక్కు ఎఫెక్ట్: మళ్లీ వార్తల్లో టాలీవుడ్ డ్రగ్ కేసు

    సమాచార హక్కు ఎఫెక్ట్: మళ్లీ వార్తల్లో టాలీవుడ్ డ్రగ్ కేసు

    ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం(ఆర్.టి.ఐ) ద్వారా టాలీవుడ్ డ్రగ్ కేసు వివరాలను సేకరించారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను బయట పెట్టారు. కేసు విచారణ ఎలా సాగింది, ఎంత మందిని విచారించడం జరిగిందనే విషయాలు తెలిపారు.

    12 కేసుల్లో 62 మంది విచారణ

    12 కేసుల్లో 62 మంది విచారణ


    టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో మొత్తం 4 చార్జిషీట్లు ఫైల్ చేసినట్లు, వివిధ ఘటనల్లో 12 కేసులు పెట్టినట్లు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన యాక్టర్లు, డైరెక్టర్లు, ఇతరుతో కలిపి మొత్తం 62 మందిని ఈ కేసులో విచారించారట. వీళ్లలో 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారు, 50 మంది ప్రముఖుల పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్‌ విద్యార్థులు ఉన్నట్లు వెల్లడైంది.

    సినీ ప్రముఖులతో పాటు అందరికీ క్లీన్ చిట్

    సినీ ప్రముఖులతో పాటు అందరికీ క్లీన్ చిట్

    ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు కానీ, ఇతరులకు కానీ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో అందరినకీ క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఐ ద్వారా పద్మనాభరెడ్డి సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది.

    ప్రముఖుల పేర్లు ఒక్క చార్జ్ షీట్లో కూడా లేదు

    ప్రముఖుల పేర్లు ఒక్క చార్జ్ షీట్లో కూడా లేదు

    అధికారులు దాఖలు చేసిన 4 చార్జి షీట్లలో దేనిలో కూడా సినీప్రముఖుల పేర్లు, వైఐపీల పిల్లల పేర్లను చేర్చలేదు. ఒక ఛార్జ్‌షీట్‌లో సౌతాఫ్రికాకు చెందిన రఫెల్ అలెక్స్‌ విక్టర్‌ పేరు ప్రస్తావించారు. అతడు ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు.

    English summary
    2017 Tollywood drug scandal again the news hit the headlines after a social activist Padmanabha Reddy filed a petition before Excise department through RTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X