twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రసవత్తరంగా సంక్రాంతి బాక్సాఫీసు పందెం, విజేత ఎవరో?

    By Bojja Kumar
    |

    Recommended Video

    రసవత్తరంగా సంక్రాంతి బాక్సాఫీసు.. విజేత ఎవరో ?

    తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత కీలకమైన పండగ సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సీజన్లో సినిమా విడుదలైతే పక్కా హిట్టే అనే సెటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన చాలా సినిమాలు హిట్టు కొట్టడం కూడా ఓ కారణం. ఈ సారి తెలుగు సినిమా పరిశ్రమ నుండి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' , రెండోది బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న 'జై సింహ'. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'గ్యాంగ్' కూడా బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.

    అజ్ఞాతవాసి

    అజ్ఞాతవాసి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకె్క్కిన ‘అజ్ఞాతవాసి' జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. వీరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందని అంటున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు.

    Poll :2017 సంవత్సరపు ఉత్తమ హీరో ఎవరు?

    జై సింహ

    జై సింహ

    నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘జై సింహ' సినిమాతో బరిలో దూకుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈచిత్రంలో నయనతార హీరోయిన్. బాలయ్య నుండి అభిమనులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండనున్నాయి. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతోంది.

    Poll : 2017 సంవత్సరంలో టాలీవుడ్ ఉత్తమ నటి ఎవరు?

     సూర్య గ్యాంగ్

    సూర్య గ్యాంగ్

    సింగం 2 తర్వాత తమిళ హీరో సూర్య నటిస్తున్న చిత్రం 'తానా సెరెంద కూట్టమ్‌'. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో యూవి క్రియేషన్స్ వారు విడుదల చేస్తుండటం, సూర్య లాంటి పెద్ద హీరో కావడంతో పవన్ కళ్యాణ్, బాలయ్య చిత్రాలకు ఎంతో కొంత పోటీ తప్పదని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

     సంక్రాంతి విజేత ఎవరు?

    సంక్రాంతి విజేత ఎవరు?

    గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పోటీ తక్కువగా ఉందనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రం బరిలో ఉండటం... అందులో ఒకటి డబ్బింగ్ చిత్రం కావడంతో కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఏ సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తాయి? ఈ సంక్రాంతి విజేత ఎవరు? అనేది తేలాల్సి ఉంది.

    English summary
    Pawan Kalyan's Agnyathavaasi, Balakrishna's Jai Simha, Surya's Gang movies set to release this Sankranthi 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X