Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రసవత్తరంగా సంక్రాంతి బాక్సాఫీసు పందెం, విజేత ఎవరో?
Recommended Video
తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత కీలకమైన పండగ సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సీజన్లో సినిమా విడుదలైతే పక్కా హిట్టే అనే సెటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన చాలా సినిమాలు హిట్టు కొట్టడం కూడా ఓ కారణం. ఈ సారి తెలుగు సినిమా పరిశ్రమ నుండి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' , రెండోది బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న 'జై సింహ'. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'గ్యాంగ్' కూడా బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.
అజ్ఞాతవాసి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకె్క్కిన ‘అజ్ఞాతవాసి' జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. వీరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందని అంటున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు.
Poll :2017 సంవత్సరపు ఉత్తమ హీరో ఎవరు?
జై సింహ
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘జై సింహ' సినిమాతో బరిలో దూకుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈచిత్రంలో నయనతార హీరోయిన్. బాలయ్య నుండి అభిమనులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండనున్నాయి. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతోంది.
Poll : 2017 సంవత్సరంలో టాలీవుడ్ ఉత్తమ నటి ఎవరు?
సూర్య గ్యాంగ్
సింగం 2 తర్వాత తమిళ హీరో సూర్య నటిస్తున్న చిత్రం 'తానా సెరెంద కూట్టమ్'. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో యూవి క్రియేషన్స్ వారు విడుదల చేస్తుండటం, సూర్య లాంటి పెద్ద హీరో కావడంతో పవన్ కళ్యాణ్, బాలయ్య చిత్రాలకు ఎంతో కొంత పోటీ తప్పదని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
సంక్రాంతి విజేత ఎవరు?
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పోటీ తక్కువగా ఉందనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రం బరిలో ఉండటం... అందులో ఒకటి డబ్బింగ్ చిత్రం కావడంతో కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఏ సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తాయి? ఈ సంక్రాంతి విజేత ఎవరు? అనేది తేలాల్సి ఉంది.