మొదట్లో, చివర్లో బుక్కయిన వర్మ.. రామ్ చరణ్‌, బాలకృష్ణలపై దారుణమైన ట్రోల్స్

రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత ప్రజలకు, సెలబ్రిటీలకు మధ్య దూరాన్ని తగ్గిస్తూ వస్తోంది. ఏదైనా సినిమాపై గానీ, లేదా సెలబ్రిటీలపై గానీ సాధారణ ప్రజలు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఇచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం (2019)లో ఎక్కువగా ట్రోల్ చేయబడిన సినిమాల లిస్ట్ చూస్తే..

 బాలకృష్ణను ఆడుకున్న నెటిజన్లు

బాలకృష్ణను ఆడుకున్న నెటిజన్లు

స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. 2019 జనవరి 9న విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ, విద్యాబాలన్ లీడ్ రోల్స్ పోషించారు. క్రిష్ దర్శకత్వం వహించాడు. అనుకున్న స్థాయిలో ఈ సినిమా అలరించలేదు. దీనిని తెరకెక్కించిన విధానంపై నెట్టింట్లో తెగ ట్రోల్స్ నడిచాయి.

బోయపాటి సినిమాతో రామ్ చరణ్‌పై

బోయపాటి సినిమాతో రామ్ చరణ్‌పై

రంగస్థలం లాంటి బ్లాక్‌బాస్టర్ హిట్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' చేశాడు రామ్ చరణ్. 2019 జనవరి 11న విడుదలైన ఈ సినిమాలో చెర్రీ జోడీగా కియారా అద్వానీ నటించింది. అయితే ఈ యాక్షన్ సీన్స్ రియాల్టికి దూరంగా ఉండటంతో నెటిజన్స్ బాగా ట్రోల్ చేశారు. ఈ కాలంలో కూడా ఇలాంటి సినిమాను చేయటానికి రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడు, బోయపాటి ఎలా తీశాడంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

ఎన్టీఆర్ రాజకీయ జీవితం.. క్రిష్‌పై కామెంట్స్

ఎన్టీఆర్ రాజకీయ జీవితం.. క్రిష్‌పై కామెంట్స్


ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 2019 ఫిబ్రవరి 22న విడుదలైంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేసిన క్రిష్ పై మరోసారి విరుచుకుపడ్డారు నెటిజన్లు. సినిమా తెరకెక్కించిన విధానాన్ని తప్పుబట్టారు.

 దొరికిపోయిన రామ్ గోపాల్ వర్మ

దొరికిపోయిన రామ్ గోపాల్ వర్మ

ఏపీ రాజకీయాలపై సంధించిన విమర్శనాస్త్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి ఎలాంటి కుట్రలు జరిగాయనేది ఈ చిత్ర కథ. 2019 మార్చి 29న విడుదలైంది. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ఇది. దీనిపై కూడా నెట్టింట్లో తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు.

రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్

రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్


అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'మన్మథుడు 2'. 2019 ఆగస్టు 9న ఈ సినిమా విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ మధ్య ముద్దు సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై ఓ రేంజ్ ట్రోల్స్ నడిచాయి.

అయ్యో పాపం! విజయ్ దేవరకొండ

అయ్యో పాపం! విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. 26 జులై 2019న 4 భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాపై తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఓవర్ ప్రమోషన్స్ చేసి దానికి తగ్గట్టుగా సినిమా లేకపోవటం మైనస్‌గా నిలిచింది.

ప్రభాస్ కూడా ఆ లిస్ట్‌లో..

ప్రభాస్ కూడా ఆ లిస్ట్‌లో..

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ 'సాహో' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 ఆగస్టు 30న విడుదలై డీలా పడింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ట్రోల్స్ బారిన పడింది.

పాయల్ రాజ్‌పుత్ పరేషాన్..

పాయల్ రాజ్‌పుత్ పరేషాన్..

RX100 బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం RDX లవ్. అక్టోబర్ 11వ తేదీ 2019న విడుదలైన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశ పర్చింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ వాడిన హాట్ ఫోటోస్ చూపిస్తూ నెట్టింట్లో చాలా ట్రోల్స్ నడిచాయి.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
ఏడాది చివర్లో మరోసారి బుక్కయిన వర్మ

ఏడాది చివర్లో మరోసారి బుక్కయిన వర్మ

2019 ఏడాది చివర్లో వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి బుక్కయ్యాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా డిసెంబర్ 12న విడుదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణమాలపై వస్తున్న చిత్రంపై విడుదలకు ముందే దారుణమైన ట్రోల్స్ నడిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X