Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
టాలీవుడ్ మూవీస్ 2019: టాప్ టీఆర్ఫీ రేటింగ్ పొందిన సినిమాలివే.. హవా అంతా వాళ్ళిద్దరిదే
ఎప్పటిలాగే 2019 సంవత్సరంలో తెలుగు చిత్రసీమలో ఎన్నో కొత్త చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా, మరికొన్ని సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులపడమే గాక బుల్లితెర ప్రేక్షకులనూ అలరించాయి. అయితే 2019 సంవత్సరానికి గాను టాప్ టీఆర్ఫీ రేటింగ్ పొందిన సినిమాల లిస్ట్ చూస్తే..
17.2 టీఆర్ఫీతో F2 సినిమా మొదటి స్థానంలో నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు నీరాజనం పలికారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత రెండో స్థానంలో మాస్ మాసాల మూవీ 'ఇస్మార్ట్ శంకర్' నిలిచింది. ఈ సినిమాకు 16.63 టీఆర్ఫీ రేటింగ్ లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా మూడో స్థానంలో 'కాంచన 3' నిలిచింది. అన్నీ తానై లారెన్స్ చేసిన ఈ సినిమాకు 13.10 టీఆర్ఫీ రేటింగ్ లభించింది.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. మహేష్ బాబు- మహర్షి (9.2), సమంత- ఓ బేబీ (9), నాని- జెర్సీ (8.8), నాగచైతన్య- మజిలీ (7.9), రాంచరణ్- వినయ విధేయ రామ (7.90), కాజల్- సీత (7.53), కళ్యాణ్ రామ్- 118 మూవీ (6.33) టీఆర్ఫీ రేటింగ్స్ పొందాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మొత్తంగా చూస్తే 2019 బుల్లితెర సినిమా హంగామా అంతా వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరిదే అని తెలుస్తోంది.