For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని వెనక్కి నెట్టిన ప్రభాస్.. రెబల్ స్టార్ తర్వాతే మెగాస్టార్

    |

    2019 సంవత్సరం తెలుగు చిత్రసీమలో పెద్ద సినిమాల హంగామా కనిపించింది. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి బడా హీరోలు తమ తమ సినిమాలతో సందడి చేశారు. తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లో మాంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో యూఎస్ మార్కెట్‌లో 2019కి గాను బాగా పర్ఫార్మ్ చేసిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దామా..

     రెబల్ స్టార్ తర్వాతే మెగాస్టార్

    రెబల్ స్టార్ తర్వాతే మెగాస్టార్

    ప్రముఖ సినీ విశ్లేషకులు రమేష్ బాలా యూఎస్ మార్కెట్‌లో 2019కి గాను టాప్ 10 టాలీవుడ్ మూవీస్ లిస్ట్ ఇదే అని పోస్ట్ చేశారు. ఈ లిస్టులో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ సినిమా 'సాహో' మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' నిలిచింది. యూఎస్ మార్కెట్ లో ఈ ఏడాది పర్‌ఫార్‌మెన్స్ ఆధారంగా ఈ లిస్ట్ ఇచ్చారు రమేష్ బాలా.

    పోటీపడ్డ వెంకటేష్, మహేష్ బాబు

    పోటీపడ్డ వెంకటేష్, మహేష్ బాబు

    ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2 మూడో స్థానంలో నిలవగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆయన 25వ సినిమా మహర్షి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ రకంగా ఈ ఏడాదికి గాను యూఎస్ మార్కెట్‌లో పోటీ పడ్డారు స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు.

    టాప్ 10లో బాలయ్య

    టాప్ 10లో బాలయ్య

    మరోవైపు ఐదో స్థానంలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా నిలవగా, ఆరో స్థానంలో సమంత లీడ్ రోల్ పోషించిన ఓ బేబీ సినిమా నిలిచింది. అదేవిధంగా ఏడు, ఎనిమిది స్థానాల్లో వరుసగా నాని- గ్యాంగ్ లీడర్, బాలకృష్ణ- ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు నిలిచాయి.

    చివర్లో విజయ్ దేవరకొండ, నాగ చైతన్య

    ఇక చివరగా తొమ్మిది, పది స్థానాలను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ స్టార్ హీరో నాగ చైతన్య దక్కించుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా తొమ్మిదో స్థానంలో నిలిస్తే, నాగ చైతన్య- సమంత జంటగా రూపొందిన మజిలీ పదో స్థానంలో నిలిచింది. ఏదేమైనా ఈ ఏడాది యూఎస్ మార్కెట్‌లో తెలుగు సినిమాల హవా చెప్పుకోదగినదిగా కనిపించింది.

    English summary
    In year 2019 so many tollywood movie performed in Us Market. But Top 1 place is for Prabhas then Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X