twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020 Top Rated Movies: దక్షిణాది చిత్రాల హవా.. టాప్-20లో మనవి నాలుగే.. మహేశ్‌కు బిగ్ షాక్!

    |

    2020వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావంతో షూటింగులు నిలిచిపోవడం.. థియేటర్లు మూతపడడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఈ కారణంగానే చాలా తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. ఓటీటీల ద్వారా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. థియేటర్ల మాదిరి మజాను పంచలేకపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ IMDB ఈ ఏడాది ఎక్కువ రేటింగ్ ఇచ్చిన 25 చిత్రాల జాబితా విడుదలైంది. ఇందులో తెలుగు నుంచి ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు ఫ్లాప్ చిత్రాలకూ చోటు దక్కింది. ఆ వివరాలు మీకోసం!

    ఈ జాబితాలో మలయాళ చిత్రాల హవా

    ఈ జాబితాలో మలయాళ చిత్రాల హవా

    ప్రముఖ వెబ్‌సైట్ IMDB అన్ని భాషల్లో విడుదలైన సినిమాలకు రేటింగ్ ఇస్తుంటుంది. ఈ ఏడాది ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాల జాబితాలో మలయాళ పరిశ్రమకు చెందిన చిత్రాలు హవాను చూపించాయి. మరీ ముఖ్యంగా ‘అంజామ్ పత్తిర' 8 రేటింగ్‌తో మొదటి స్థానం, ‘అయ్యప్పనుమ్ కోషియం' 7.9 రేటింగ్‌తో రెండో స్థానం సాధించాయి. ఇలా టాప్-10లో నాలుగు చిత్రాలు నిలిచాయి.

    రెండో స్థానానికి పడిపోయిన బాలీవుడ్

    రెండో స్థానానికి పడిపోయిన బాలీవుడ్

    ఇండియా సినిమాలో బాలీవుడ్‌దే అగ్రరాజ్యం అనేవాళ్లు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. అన్ని ఇండస్ట్రీల్లో వాళ్లకు మించిన చిత్రాలు వస్తున్నాయి. ఈ కారణంగానే IMDB టాప్ -10లో కేవలం మూడు చిత్రాలు.. ‘తానాజీ' 7.6 రేటింగ్‌తో నాలుగో స్థానంలో, ‘అంగ్రేజీ మీడియం' 7.3 రేటింగ్‌తో ఆరో స్థానంలో, తాప్సీ నటించిన ‘తప్పడ్' 6.9 రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచాయి.

    బన్నీ టాప్.. మహేశ్ బాబుకు బిగ్ షాక్

    బన్నీ టాప్.. మహేశ్ బాబుకు బిగ్ షాక్

    IMDB ప్రకటించిన ఉత్తమ రేటింగ్ చిత్రాల జాబితాలో టాప్-10లో కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా నిలిచింది. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' 7.1 రేటింగ్‌తో ఏడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇక, ఇదే సంక్రాంతి సీజన్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు' మాత్రం 6 రేటింగ్‌తో 21వ స్థానంలో ఉంది. దీంతో మహేశ్ బాబుకు బిగ్ షాక్ తగలినట్లైంది.

    రెండు తెలుగు ఫ్లాప్ సినిమాలు కూడా

    రెండు తెలుగు ఫ్లాప్ సినిమాలు కూడా

    టాప్ -20లో ‘అల.. వైకుంఠపురములో'తో పాటు మరో మూడు సినిమాలు కూడా చోటు దక్కించుకున్నాయి. అందులో భారీ అంచనాలతో విడుదలై పరాజయం పాలైన ‘జాను' 6.9 రేటింగ్‌తో పదకొండో స్థానంలోనూ, మరో తెలుగు డిజాస్టర్ మూవీ ‘డిస్కోరాజా' 6.3 రేటింగ్‌తో 19వ స్థానంలోనూ నిలిచాయి. అలాగే, నితిన్ నటించిన ‘భీష్మ' 6.5 రేటింగ్‌తో పదహారో స్థానాన్ని అందుకుంది.

    తమిళ చిత్ర పరిశ్రమకు తొలిసారి ఇలా

    తమిళ చిత్ర పరిశ్రమకు తొలిసారి ఇలా

    ఈ ఏడాది తమిళ పరిశ్రకు భారీ పరాభయం ఎదురైంది. IMDB ప్రకటించిన ఉత్తమ రేటింగ్ చిత్రాల జాబితాలో టాప్-10లో ఒక్కటంటే ఒక్క కోలీవుడ్ మూవీ కూడా లేదు. కానీ, జీవా నటించిన ‘జిప్సీ' 6.5 రేటింగ్‌తో 17వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, ‘సైకో' 6.3 రేటింగ్‌తో 18వ స్థానంలోనూ, రజినీకాంత్ నటించిన ‘దర్భార్' 6.1 రేటింగ్‌తో 20వ స్థానంలోనూ నిలిచి పర్వాలేదనిపించాయి.

    English summary
    IMDb is an online database of information related to films, television programs, home videos, video games, and streaming content online – including cast, production crew and personal biographies, plot summaries, trivia, ratings, and fan and critical reviews.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X