twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో ఎక్కువ టికెట్లు బుక్కైన సినిమాలు: టాప్ -5లో తెలుగు సినిమాలు మూడు!

    |

    థియేటర్లలో సినిమా చూడాలంటే గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని టికెట్లు కొనుక్కునే రోజులు పోయాయి. దీనికి కారణం బుక్ మై షో వంటి యాప్స్ అందుబాటులోకి రావడమే. వీటి నిమిషాల వ్యవధిలోనే సినిమా టికెట్లను బుక్ చేసుకోగలుగుతున్నారు. దీని వల్ల ఆయా యాప్‌లకు భారీగా లాభాలు వస్తున్నాయి. అయితే, 2020లో కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోవడంతో పాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో వాటికి అంతగా ఆదరణ లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బుక్ మై షోలో టికెట్లు ఎక్కువగా అమ్ముడైన జాబితా విడుదలైంది. టాప్‌ -5లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి!

    మొదటి స్థానంలో బాలీవుడ్ హిస్టారిక్ ఫిల్మ్

    మొదటి స్థానంలో బాలీవుడ్ హిస్టారిక్ ఫిల్మ్

    మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సేనకు సైన్యాధిపతిగా పని చేసిన తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘తానాజీ: ది అన్ సంగ్ వారియర్'. సీనియర్ హీరో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సంవత్సరం బుక్ మై షోలో ఎక్కువ టికెట్లను కొనుగోలు చేసిన చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

    తెలుగు సినిమాకు జాబితాలో రెండో స్థానం

    తెలుగు సినిమాకు జాబితాలో రెండో స్థానం

    అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఏకంగా రూ. 132 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, 2020లో ఎక్కువ టికెట్లు బుక్కైన చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది.

    సరిలేరు అనిపించుకున్న తెలుగు సినిమా

    సరిలేరు అనిపించుకున్న తెలుగు సినిమా

    వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఇది కూడా సంక్రాంతి కానుకగానే విడుదలై ఘన విజయాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 107.6 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక, బుక్ మై షోలో ఎక్కువ టికెట్లు అమ్ముడైన చిత్రాల జాబితాలో ఇది మూడో స్థానంలో ఉంది.

     సూపర్ స్టార్ రజినీ మూవీకి నాలుగో స్థానం

    సూపర్ స్టార్ రజినీ మూవీకి నాలుగో స్థానం

    సూపర్ స్టార్ రజినీకాంత్ - నయనతార కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘దర్భార్'. నివేదా థామస్ కీలక పాత్రను పోషించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపేసింది. ఇక, 2020లో బుక్ మై షోలో ఎక్కువ టికెట్లను కొనుగోలు చేసిన చిత్రాల లిస్టులో ఇది నాలుగో ర్యాంక్‌ను సాధించింది.

    టాప్-5లో చోటు దక్కించుకున్న మన ఫిల్మ్

    టాప్-5లో చోటు దక్కించుకున్న మన ఫిల్మ్

    వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘భీష్మ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 25 కోట్ల వరకూ రాబట్టి నితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. లాక్‌డౌన్ ముందు రిలీజ్ అయిన ఈ చిత్రం ఐదో స్థానాన్ని అందుకుంది.

    English summary
    BookMyShow has released a list of films with most tickets booked this year in India. #AlluArjun's #AlaVaikunthapuramlo which turned out to a blockbuster stood 2nd while #Mahesh's #SarileruNeekevvaru ended up being 3rd. #Nithiin's romantic comedy #Bheeshma came 5th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X