twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో ట్రెండ్ సెట్ చేసిన ట్వీట్స్.. విజయ్, అమితాబ్, మహేష్‌ల హవా

    |

    సోషల్ మీడియా లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మందికి పొద్దుపోవడం లేదు. ఈ దారిలో పనికొచ్చే విషయాల కంటే నెగిటివ్ అంశాలు ఎక్కువగా హైలెట్ అవుతున్నప్పటికి సోషల్ మీడియా డోస్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక 2020 ట్విట్టర్ మరోసారి తన సత్తాను చాటింది. సెలబ్రెటీల జోరుతో ఒక్కసారిగా న్యూ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక అందులో అమితాబ్ బచ్చన్, విజయ్, మహేష్ బాబులకు సంబంధించిన ట్వీట్స్ ఉండడం విశేషం.

    విజయ్ సెల్ఫీ సృష్టించిన సంచలనం

    విజయ్ సెల్ఫీ సృష్టించిన సంచలనం

    మొదటగా ట్విట్టర్ లో అత్యదికంగా రీట్వీట్ చేసిన లిస్టులోకి వెళితే 145.7k రీ ట్వీట్స్ తో విజయ్ ఫ్యాన్స్ న్యూ రికార్డ్ క్రియేట్ చేశారు. విజయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇక విజయ్ కు మద్దతు ఇవ్వడానికి తమిళనాడులో ఉన్న అభిమానులు మొత్తం మాస్టర్ షూటింగ్ స్పాట్ కు వచ్చారు. అప్పుడు విజయ్ తీసిన సెల్ఫీ ఫొటోను ఇండియాలో అత్యధిక మంది రీ ట్వీట్ చేశారు.

    రామాయణ ముందు.. పోకిరి తరువాత

    రామాయణ ముందు.. పోకిరి తరువాత

    ఇక అత్యధికంగా హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడంలో స్టార్ హీరోల అభిమానులు ఈ సారి చాలా రకాలుగా పోటీ పడ్డారు. అలాగే దైవభక్తికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కూడా ఈ సారి గట్టిగానే ట్రెండ్ అయ్యాయి. మొదట రామాయణ పేరుతో అత్యదిక హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ అవ్వగా ఆ తరువాత పోకిరి సినిమాపై ట్వీట్స్ రావడం విశేషం. ఇక మూడవ స్థానంలో మహాభారతం నిలిచింది.

    బెస్ట్ 2020 ట్వీట్ లో అమితాబ్ బచ్చన కరోనా

    బెస్ట్ 2020 ట్వీట్ లో అమితాబ్ బచ్చన కరోనా

    ఇక 2020లో ఉల్లిక్కిపడేలా చేసిన కరోనా వైరస్ పలువురు స్టార్ సెలబ్రెటీలను బలి తీసుకుంది. ఇక 78ఏళ్ళ వయసులో ఉన్న అమితాబ్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇక పాజిటివ్ వచ్చిందని జులై 11న అమితాబ్ వేసిన ట్వీట్ కోటెడ్ చేయబడిన బెస్ట్ 2020 ట్వీట్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఆయన కోలుకున్న తరువాత కూడా అభిమానులు అధిక సంఖ్యలు విషెస్ అందించిన ట్వీట్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి.

    Recommended Video

    #SingerSunithaEngagement: వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత పెళ్లి | Singer Sunitha Second Marriage
    సుశాంత్ తో పాటు మహేష్ సినిమాలు కూడా

    సుశాంత్ తో పాటు మహేష్ సినిమాలు కూడా

    ఇక మోస్ట్ ట్వీటేడ్ మూవీ హ్యాష్ ట్యాగ్స్ లలోకి వెళితే.. మొదట సుశాంత్ రాజ్ పుత్ ఆఖరి సినిమా నిలిచింది. దిల్ బెచారా సినిమా లాక్ డౌన్ కారణంగా హాట్ స్టార్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రిలీజ్ నుంచే జనాలు ఎమోషనల్ ఫీలింగ్ తో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ గా మార్చారు. అనంతరం సూర్య *సురారైపోట్రు* (ఆకాశం నీ హద్దురా), మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నిలిచాయి. మహేష్ పోకిరి సినిమాతో పాటు సరిలేరు నీ కెవ్వరు కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడానికి కారణం మహేష్ నెవర్ బిఫోర్ లుక్స్ అనే చెప్పాలి.

    English summary
    Most people do not have to be taken in the present days without social media. Social media doos do not decline any of the negative elements higher than things that work in this route. The more 2020 Twitter once again made his saturday. Created New Records with a single day of the celebrity. There is no tweets related to Amitabh Bachchan, Vijay and Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X