సంక్రాంతికి మహేష్ ఒక్కడే కాదు.. పోటీగా మరో ముగ్గురు స్టార్ హీరోలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకేసారి పెద్ద సినిమాల విడుదల తేదీలు వరదల్లా వచ్చేశాయి. ఒకరి తరువాత మరొకరు గ్యాప్ లేకుండా ఎనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియదు గాని బాక్సాఫీస్ కు ఈ ఏడాది పూనకలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ ఎడాది బాక్సాఫీస్ ను మిస్సవుతున్నాడు మహేష్ బాబు. అయితే ఆయనతో పాటు మరో ముగ్గురు అగ్ర హీరోలు పోటీగా వస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట..

మహేష్ బాబు సర్కారు వారి పాట..

2022 సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనే లుక్ తో కనిపిస్తున్నాడు. దీంతో గతంలో కంటే మహేష్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడం కాయం.

పోటీలో త్రివిక్రమ్ తారక్ ప్రాజెక్ట్

పోటీలో త్రివిక్రమ్ తారక్ ప్రాజెక్ట్

అయితే ఈ సినిమా ఒక్కటే సంక్రాంతి బరిలో నిలవడం లేదు. పోటీగా మరో ముగ్గురు హీరోలు కూడా వస్తున్నారు. ముందుగా టార్గెట్ సెట్ చేసుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాల డోస్ అంతకంతకు పెరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

సంక్రాంతికి పవర్ స్టార్ కూడా

సంక్రాంతికి పవర్ స్టార్ కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి ఒక పిరియాడిక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్పీడ్ అందుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా సైతం సంక్రాంతి ఫైట్ కు సిద్ధమవుతోంది.

Recommended Video

Yash KGF 2 Gets A Release Date | Biggest Pan India Movie KGF 2
సిద్దమవుతున్న సలార్

సిద్దమవుతున్న సలార్

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనంతరం సలార్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఆ సినిమా కూడా 2022 పొంగల్ కు రెడీ కానుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి హాలిడే సీజన్ లోనే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ లో ఏ హీరో సినిమా పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X