2023 Sankranti box office: పవన్, మహేష్, ప్రభాస్ బాక్సాఫీస్ వార్.. సంక్రాంతికి టాలీవుడ్‌లో బిగ్ క్లాష్!

సంక్రాంతి అనగానే సౌత్ సినిమా ఇండస్ట్రీలో సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొంగల్ బరిలో పెద్ద సినిమాలతో కూడా కొన్ని సినిమాలు పోటీ పడేందుకు సిద్ధమవుతూ ఉంటాయి. మంచి సినిమాలకు సంక్రాంతి కలెక్షన్స్ ఊహించని రేంజిలో ఉంటాయి అని పోటీ ఎంత ఉన్నా కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతుంటారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫైట్ లో మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

2023 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్

2023 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్

గత ఏడాది అలాగే అంతకు ముందు ఏడాది కూడా కరోనా ప్రభావం వలన సంక్రాంతి సీజన్ మొత్తం చాలావరకు వృధా అయింది అని చెప్పాలి. కానీ 2023 సంక్రాంతికి మాత్రం ఒకేసారి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈసారి బాక్సాఫీస్ ఫైట్ మాత్రం పెద్ద సినిమాల మధ్య జరగబోతున్న ట్లుగా తెలుస్తోంది. అది కూడా ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ వంటి పెద్ద హీరోల మధ్య లోనే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది

ఆదిపురుష్..

ఆదిపురుష్..

ముందుగా ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు గా ఇదివరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనోన్ కనిపించబోతుంది. ఇక రావణుడిగా బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు.

విజయ్ సినిమా కూడా..

విజయ్ సినిమా కూడా..

ఇక ప్రభాస్ సినిమా తో పాటు విజయ్ వంశీ పైడిపల్లి కలయిక లో రాబోతున్న సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేసారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. హీరోయిన్ గా మొదటిసారి విజయ్ తో రష్మిక మందన నటించబోతోంది.

 పవన్, మహేష్ సంక్రాంతి టార్గెట్

పవన్, మహేష్ సంక్రాంతి టార్గెట్

అయితే ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా అదే సమయానికి రాబోతుండగా పవన్ కళ్యాణ్ క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కూడా సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ సమంత మూవీ

విజయ్ దేవరకొండ సమంత మూవీ

ఇక విజయ్ దేవరకొండ సమంత కలయికలో వస్తున్న మరొక క్యూట్ లవ్ స్టొరీ సంక్రాంతి ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. తప్పకుండా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఏ స్టార్ హీరో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X