TANA 2015: సభలో అలరించిన సినీ కామెడీ స్కిట్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: అమెరికాలోని డెట్రాయిట్‌లో జరుగుతున్న తానా మహాసభలు చివరి రోజు ఉత్సాహంగా జరిగిన సంగతి సంగతితెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తేజ్ ఏర్పాటు చేసిన కామెడీ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ కామెడీ షో మీకూ చూడాలని అయితే ఇక్కడే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ స్కిట్ లో ....సినీపరిశ్రమలో ఎందుకు పెట్టుబడిపెడతారు? ఎలాంటి వారు నిర్మాతలుగా మారుతారు? అనే అంశం ప్రాధాన్యంగా కథ కొనసాగుతుంది. అక్షర జ్ఞానం లేని ఓ ధనవంతుడు నిర్మాతగా మారితే సినీ పరిశ్రమ ఎలా తయారవుతుందో హాస్యం చిందిస్తూ కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఈ హాస్య నాటికలో ప్రముఖ హాస్యనటులు రవిబాబు, వేణుమాధవ్‌, రఘుబాబు, ఉత్తేజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కామెడీ స్కిట్ అందరినీ అలరించింది. మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక యుఎస్ లోని రెండు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాలు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్‌) తమ ద్వైవార్షిక మహాసభలను గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహించాయి. గురువారం సాయంత్రం విందు కార్యక్రమంతో రెండు చోట్లా వేడుకలు మొదలయ్యాయి.

20th TANA 2015 Conference - Comedy Skit

ఈ తానా 20వ మహాసభలను డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్‌, అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. అలాగే..... నాట్స్‌ 4వ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్‌ సెంటర్‌లో సమన్వయకర్త ఆలపాటి రవి నేతృత్వంలో జరుగుతున్నాయి.

ఇక నాట్స్‌ సంబరాల్లో .. నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, పీపీ రెడ్డి, జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్‌ శేషసాయి, నిమ్మగడ్డ ప్రసాద్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌, విమలా రామన్‌, కమలిని ముఖర్జీ, అనూప్‌ రూబెన్స్‌, వందేమాతరం, సిరాశ్రీ, గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అలాగే... తనికెళ్ల భరణి, గీతామాధురి, భాస్కరభట్ల, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఇప్పటికే చేరుకున్నారు.

ఇక , తానా ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథులు నాట్స్‌ ముగింపు వేడుకలకు, నాట్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖులు తానా ముగింపు ఉత్సవాలకు హాజరయ్యేలా, రెండు సభలకూ హాజరయ్యే తెలుగువారందరితో సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X