twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    21 years for badri.. నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్.. పవన్ ఫ్యాన్స్ రచ్చ

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమా రిలీజై నేటికి 21 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అటు పూరి జగన్నాథ్ కు ఇటు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సినిమాలో చాలా ఫేమస్ డైలాగ్ లు ఉంటాయి, ఆ డైలాగ్ లను గుర్తు తెచ్చుకుని మరి పవన్ అభిమానులు #21yearsforbadri అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బద్రి సినిమా కి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.

    'నువ్వు నందా వైతే ఏంటి నేను బద్రి బద్రీనాథ్'

    'నువ్వు నందా వైతే ఏంటి నేను బద్రి బద్రీనాథ్'

    అప్పటికే సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు అంటూ మూడు హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి దూకుడు మీద ఉన్న పవన్ కళ్యాణ్ ను ఆ మూడు సినిమాల కంటే డిఫరెంట్ గా చాలా పవర్ఫుల్ గా బద్రిలో ప్రజెంట్ చేశారు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో 'నువ్వు నందా వైతే ఏంటి నేను బద్రి బద్రీనాథ్' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే ఈ డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంటుంది.

    పవన్ కళ్యాణ్ ఒక యాడ్ ఏజెన్సీ నడిపే వ్యక్తి గా ఈ సినిమాలో కనిపిస్తారు. రేణు దేశాయ్, అమీషా పటేల్ ఇద్దరూ పవన్ సరసన హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరికీ ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. తరువాతి రోజుల్లో రేణుదేశాయ్ పవన్ జీవితంలో కి భార్య కూడా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే.

    మ్యూజికల్ సెన్సేషన్

    మ్యూజికల్ సెన్సేషన్

    ఈ సినిమా మ్యూజిక్ కూడా అప్పట్లో మంచి హిట్ అయింది. తమ్ముడు సినిమాకు పనిచేసిన రమణ గోగుల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బాగా కుదరడంతో ఈ సినిమాకి కూడా వీరి కాంబినేషన్ ను రిపీట్ చేశారు. ఈ దెబ్బకు ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అయాం యాన్ ఇండియన్ అనే ఇన్స్పిరేషనల్ సాంగ్ అయితే ఇప్పటికీ యూత్ నోళ్లలో నానుతూనే ఉంటుంది.. ఇక బంగాళాఖాతంలో, హే చికితా లాంటి పాటలు చాలామంది ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటారు..

    ఇక వేవేల వర్ణాల తార అనే పాట మాత్రం రొమాంటిక్ టచ్ తో చాలా ఆల్బమ్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. అలా మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన ఈ సినిమా 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలై నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

    అమెరికాలో మొదటి తెలుగు సినిమా

    అమెరికాలో మొదటి తెలుగు సినిమా

    85 థియేటర్లలో 50 డేస్, 47 థియేటర్లలో హండ్రెడ్ డేస్ జరుపుకున్న ఈ సినిమా అమెరికా లో విడుదలైన తొలి తెలుగు సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది. అప్పటిదాకా అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. కానీ పవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అప్పట్లో మొట్టమొదటిసారిగా ఈ సినిమాను అమెరికాలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా అమెరికాలో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి.

    ఇది పూరీకి మొదటి సినిమా కాదు.. కానీ

    ఇది పూరీకి మొదటి సినిమా కాదు.. కానీ

    మరో ఆసక్తికర అంశం ఏమిటంటే పూరి జగన్నాథ్ కు బద్రి మొదటి సినిమా కాదు. ఈ సినిమా కంటే ముందే ఆయన సూపర్ స్టార్ కృష్ణ తో 96 లో ఒక సినిమా చేయడం మొదలు పెట్టారు. అయితే సినిమా షూటింగ్ అంతా పూర్తి అయినా సరే అనుకోని కారణాల వలన సినిమా విడుదల కాలేదు. దీంతో తో పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ సినిమా చేసి రిలీజ్ చేయగా అదే తన మొట్టమొదటి సినిమా అయింది.

    English summary
    Power Star Pawan Kalyan's badri movie completes 21 years in tollywood. director jagannadh completes 21 years in tollywood with this film. #21yearsforbadri is trending now in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X