ప్రయోగాల బాటలో ...
మూస మసాలా చిత్రాలతో మనకి పోటినిచ్చే ఏకైక పరిశ్రమ కోలివుడ్(తమళ పరిశ్రమ). కాని వాళ్ళు కూడా మనల్ని వదిలి ప్రయోగాలతో ముందుకు వెళ్ళిపోతున్నారు. హీరో అనే వాడు లేకుండా 'చెన్నై 28' అనే చిత్రం తీసి పాపులర్ అయిన వెంకట్ ప్రభు తాజాగా 'సరోజా' అనే మరో సాహసానికి ఒడి కట్టాడు. ఈ సినిమాలో కథ మొత్తం ఒక రోజులో సరోజా అనే అమ్మాయి జీవితంలో ఏం జరిగిందనేదట. దాంతో రియలిస్టిక్ గా ఉండాలని ఎవరు కాస్ట్యూమ్స్ కూడా మార్చరట. సినిమా మొత్తం ఒకటే కంటిన్యుటిట. మరి పాటలు ...అంటే ఉండవేమో అంటున్నారు. ఇది ఇలా ఉంటే దీనికి పోటీగా 'కుదీయారసు' అనే చిత్రం తయారవుతోంది. దీని ప్రత్యేకత 12 గంటల్లో ఓ జర్నలిస్టు జీవితంలో జరిగే సంఘటనల సమాహారమట. కమర్షియాలిటీని ప్రక్కన పెట్టి ఇలా ప్రయోగాలు బాట పట్టటం రిస్క్ అవుతుందేమో గాని సక్సెస్ అయితే మాత్రం వాళ్ళకు సాటి ఎవరు..మన వాళ్ళు కూడా ఇలా కొత్తగా ప్రయత్నిస్తే బావుంటుంది కదా


Click it and Unblock the Notifications











