»   » మరీ పబ్లిక్‍‌లో ఈ ముద్దులేంటి?.... హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్ 24 కిస్సెస్ టీజర్!

మరీ పబ్లిక్‍‌లో ఈ ముద్దులేంటి?.... హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్ 24 కిస్సెస్ టీజర్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్ 24 కిస్సెస్ టీజర్!

    హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ హాట్ టాపిక్ అయింది. టీజర్ మొత్తం లిప్ లాక్ మొద్దులతో ముంచెత్తారు. టీజర్ మధ్యలో 'పబ్లిక్‌లో ఈ ముద్దులేంటి సుబ్బారావ్' అంటూ రావు రమేష్ డైలాగుతో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఈ కిస్సింగ్ టీజర్ యూత్‌ను థియేటర్ల వైపు లాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

     టాలీవుడ్లో మారుతున్న ట్రెండ్

    టాలీవుడ్లో మారుతున్న ట్రెండ్

    ముద్దు సీన్ల విషయంలో టాలీవుడ్లో ట్రెండ్ మారుతోంది. కథకు అవసరం అంటూ చాలా ముద్దు సీన్లు జొప్పిస్తున్నారు. చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఇలాంటి బాగా ఉపయోగపడతాయనేది కొందరి వాదన. అక్కడి వరకు వచ్చిన ప్రేక్షకుడికి సినిమా నచ్చితే సూపర్ హిట్టే. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల విషయంలో ఇలాంటి మ్యాజిక్కే వర్కౌట్ అయింది.

    పబ్లిసిటీ మరింత ప్లస్

    పబ్లిసిటీ మరింత ప్లస్

    పెద్దగా స్టార్ ఇమేజ్ లేని చిన్న సినిమాలకు పబ్లిసిటీ పెరగాలన్నా, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ కావాలన్నా ఏదో ఒక సెన్సేషన్ అవసరం. సెక్స్ సీన్లు పెడితే అడల్ట్ సినిమా కింద ముద్రపడిపోతుంది. ముద్దు సీన్లయితే కాస్త రొమాంటిక్ లుక్ వస్తుందనే ఉద్దేశ్యంతో టీజర్లు, ట్రైలర్లలో ఇలాంటివి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఏమిటో ఆ ఉత్సవం?

    ఈ చిత్రానికి "నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం" ట్యాగ్ లైన్ పెట్టారు. మరి ఈ ముద్దుల వెనక జరిగే ఉత్సవం ఏమిటనేది సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేక్షకులకు ఎలాంటి ఉత్సవాన్ని పంచబోతున్నారో చూడాలి.

    సినిమా నిర్మాణం

    సినిమా నిర్మాణం

    సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి, నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, కెమెరామెన్: ఉదయ్ గుర్రాల, మ్యూజిక్: జాయ్ బరువ, ఎడిటర్: ఆలయం అనిల్, రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.

    English summary
    Here's the much awaited teaser of 24 Kisses. This extended version of the teaser will make you want to see more. The First Production of #SillyMonksEntertainment, with Respect Creations, bring to you a celebration of Love. A film by AyodhyaKumar Krishnamsetty. Produced by Sanjay Reddy, Anil Pallala and AyodhyaKumar Krishnamsetty.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more