twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముద్దు సీన్ల రచ్చ: నా కూతురుతో చేయిస్తా... డబ్బు కోసమే అంటూ మరో దర్శకుడి వాగ్వాదం!

    |

    అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 తర్వాత తెలుగు సినిమాల్లో ముద్దు సీన్ల జాఢ్యం పెరిగిపోతుందనే చర్చమొదలైంది. ఇప్పుడు '24 కిస్సెస్' పేరుతో ఏకంగా సినిమా వస్తుండటంతో ఓ న్యూస్ ఛానల్ వారు తెలుగు సినిమాల్లో ముద్దు సీన్ల ధోరణి అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

    ఈ చర్చా కార్యక్రమంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో పాటు, 24 కిస్సెస్ దర్శకుడు అయోధ్య కుమార్, హీరోయిన్ హెబ్చా పటేల్, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమావారికి, చర్చలో పాల్గొన్న సామాన్యులకు మధ్య ఆసక్తికర వాగ్వివాదం చోటు చేసుకుంది.

     ఈ ముద్దు సీన్లు మీ బంధువులతో ఎందుకు చేయించలేదు?

    ఈ ముద్దు సీన్లు మీ బంధువులతో ఎందుకు చేయించలేదు?

    నాకు అయోధ్య కుమార్ పర్సనల్‌గా పరిచయం లేదు. ‘మినుగురులు' సినిమా చూసినపుడు ఆయన చాలా గొప్ప డైరెక్టర్, మంచి సినిమా తీశాడు అనుకున్నాను. ఇప్పుడేమో 24 కిస్సెస్ అంటూ ముద్దు సీన్ల సినిమా తీశాడు. డైరెక్టర్‌గారు ఏమీ అనుకోకపోతే నేను ఓ విషయం అడుగుతాను. ఇలాంటి ముుద్దు సీన్లు ఉన్న సినిమాలో హీరోయిన్‌గా మీ బంధువులను ఎందుకు పెట్టలేదు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.

    నా కూతురుతో కూడా చేయిస్తాను

    నా కూతురుతో కూడా చేయిస్తాను

    నాకింకా పెళ్లి కాలేదు, నాకు కూతురు ఉంటే తప్పకుండా ఆమెతో ఈ సినిమా చేయించేవాడిని, ఈ విషయంలో మీరు అనవసరంగా గొడవ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇటువంటి సినిమా, ఇటువంటి సినిమా అంటున్నారు. ఈ సినిమాలో కూడా హీరో పిల్లల హక్కుల కోసం పోరాడే యాక్టివిస్ట్. మీరు ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడండి. 24 ముద్దులు అనే దానికి ఒక కారణం ఉంది, దాని వెనక ఒక కథ ఉంది... అని దర్శకుడు అయోధ్య కుమార్ స్పష్టం చేశారు.

    అది నటన మాత్రమే, నిజం కాదు...

    అది నటన మాత్రమే, నిజం కాదు...

    నా కూతురు యాక్టింగ్ చేస్తానంటే వద్దంటానా? (మధ్యలో రిపోర్టర్ కల్పించుకుని ముద్దు సీన్ చూపిస్తూ.... ఇటువంటి యాక్టింగ్ చేస్తానన్నా ఒప్పుకుంటారా?), అక్కడ ముద్దు పెట్టుకోవడం నిజం కాదు, అది కేవలం నటన మాత్రమే అని అయోధ్య కుమార్ వ్యాఖ్యానించారు.

    అలాంటి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రారు

    అలాంటి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రారు

    సోషల్ కాజ్ పరంగా పెద్ద మూవీ తీయాలనుకుని ప్రొడ్యూసర్ దగ్గరకు వెళితే వారు సపోర్ట్ చేస్తారా? తీయడానికి ముందుకు వస్తారా? అనే ప్రశ్నకు అయోధ్య కుమార్ స్పందిస్తూ... ‘మినుగురులు' లాంటి సినిమా తీస్తే సమాజం ఎలాగైతే చూడటానికి ముందుకు రాదో, అలాగే నిర్మాతలు కూడా ‘మినుగురులు' లాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు అని తెలిపారు.

    అలాగని సమాజాన్ని చెడగొట్టే సినిమాలా?

    అలాగని సమాజాన్ని చెడగొట్టే సినిమాలా?

    చర్చా వేదికలో పాల్గొన్న ఒక వ్యక్తి మైక్ అందుకుని అందుకుని..... అలాగని డబ్బు కోసం ముద్దులు పెట్టే సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడతారా? అని ప్రశ్నించారు. దీంతో వెంటనే ‘24 కిస్సెస్' టీమ్‌లోని ఒక వ్యక్తి ఫైర్ అయ్యారు. దీంతో చిన్న గొడవ జరిగింది. నేను డబ్బు కోసం సినిమాలు తీయడం లేదని అయోధ్య కుమార్ స్పష్టం చేశారు.

    మీరు సమాజానికి ఏమిచ్చారో చెప్పండి

    మీరు సమాజానికి ఏమిచ్చారో చెప్పండి

    ‘ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ... ఇటువంటి సినిమాలే తీయండి, ఇటువంటి సినిమాలు తీయొద్దు అని చెప్పడానికి మీరెవరు? సమాజం అని మాట్లాడేవారు ముందు మీరు ఈ సమాజానికి ఏమిచ్చారో చెప్పాలి. నేను కూడా ఇదే సమాజంలో ఉన్నాను అంటూ ఫైర్ అయ్యారు.

    నేను డబ్బుకోసమే సినిమా తీస్తా: అజయ్ భూపతి

    నేను డబ్బుకోసమే సినిమా తీస్తా: అజయ్ భూపతి

    తన ప్రసంగానికి అడ్డు పడ్డ ఓ పెద్దయన్ను అజయ్ భూపతి ఎదురు ప్రశ్నించారు. ‘‘సమాజం మెచ్చే సినిమాలు తీస్తాను మీరు ప్రొడ్యూసర్ చేస్తారా?'' అంటూ నిలదీశారు. ఇలాంటి ప్రశ్న ఊహించని సదరు పెద్దాయన మీలాంటి వారు డబ్బు కోసమే సినిమాలు తీరంటూ ఫైర్ అయ్యారు. అవను నేను డబ్బు కోసమే సినిమాలు తీస్తానంటూ.... అజయ్ భూపతి తనను తాను సమర్ధించుకున్నారు.

    English summary
    ‘24 Kisses’ will releasing on November 23rd. Helmed by the National Award-winning director Ayodhyakumar Krishnamsetty, ‘24 Kisses’ featured Arun Adith and Hebah Patel in the lead, while Rao Ramesh, Arun and Aditi Myakal in supporting roles. The movie has been bankrolled by Sanjay Reddy, Anil Pallela and Ayodhyakumar Krishnamsetty under Silly Monks Entertainment banner in association with Respect Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X