twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాది వల్గర్ సినిమా కాదు, దిగజారి సినిమాలు చేయను: ‘24 కిస్సెస్’ డైరెక్టర్

    |

    అరుణ్‌ ఆదిత్‌, హెబ్బా పటేల్‌ జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ అయోధ్యకుమార్‌ క్రిష్ణంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '24 కిస్సెస్‌'. అయితే ముద్దు సీన్ల పోస్టర్లు విడుదల తర్వాత ఈ సినిమాపై కాస్త నెగెటివ్ ప్రచారం జరిగింది. ఇది వల్గర్ సినిమా అని, అడల్ట్ మూవీ అనే వార్తలు తెరపైకి వచ్చారు.

    నవంబర్ 23న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు ఈ వార్తలపై స్పందించారు. మా సినిమా టైటిల్‌ చూసి ఇది వల్గర్ సినిమా అనుకోవద్దు. ఇదొక మంచి ప్రేమకథా చిత్రం. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అని తెలిపారు.

    దిగజారి సినిమాలు చేయలేదు

    దిగజారి సినిమాలు చేయలేదు

    దర్శకుడిగా నేనెప్పుడూ దిగజారి సినిమాలు చేయలేదు, అలా చేయను కూడా... ముద్దులు ఎమోషన్స్‌ను క్యారీ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ పెళ్ళి, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, యూత్‌ ఎలా ఉన్నారనే విషయాలను మా సినిమాలో చూపిస్తున్నామని అయోధ్యకుమార్ తెలిపారు.

    రోటీన్ చిత్రాలకు భిన్నంగా

    రోటీన్ చిత్రాలకు భిన్నంగా

    సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుండి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు. ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాం. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఉండే ప్రేమకథ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నామని తెలిపారు.

    మరిచిపోలేని అనుభూతి ఇస్తుంది

    మరిచిపోలేని అనుభూతి ఇస్తుంది

    లవర్స్‌తో అయినా, ఫ్యామిలీతో అయినా సినిమాను థియేటర్‌లోనే చూడండి. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది... అని హీరో అరుణ్ అదిత్ తెలిపారు.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌, సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్, ఎడిట‌ర్: ఆల‌యం అనిల్, బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్, సంగీతం: జోయ్ బ‌రువా, సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌, లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంశెట్టి.

    English summary
    '24 Kisses' features Adith Arun and Hebah Patel in the lead roles and is being directed by critically acclaimed director Ayodhyakumar Krishnamsetty. Actors Rao Ramesh and Naresh will be seen in pivotal roles in the movie which has music of Joi Barua and background music is composed by Vivek Philip.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X