»   »  అదిరింది: సూర్య ‘24’ అఫీషియల్ టీజర్ (వీడియో)

అదిరింది: సూర్య ‘24’ అఫీషియల్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24'. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజైంది.

బాహుబలి స్థాయిలో 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా వస్తోన్న 24 సినిమా కోసం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చెస్తోంది.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు టీజర్ ను యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించారు.

24 Official Teaser Telugu

కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో తెరకెక్కుతోన్న 24 ఆడియెన్స్ కు ఓ సరికొత్త థ్రిల్ ను అందిస్తుందని. తిరు సినిమాటోగ్రఫి, ఎ.ఆర్ రెహ్మాన్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలయికలో విక్రమ్ కుమార్ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని నిర్మాత సునీల్ N. నారంగ్ తెలిపారు.

సూర్య ,సమంత, నిత్యమీనన్, అజయ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రఫీ: తిరు,కిరణ్ డెహాన్స్.., కూర్పు: ప్రవీణ్ పూడి. నిర్మాత : సునీల్ N.నారంగ్, రచన- దర్శకత్వం: విక్రమ్ కుమార్.

English summary
24 Official Telugu Teaser released. staring Suriya, Samantha Ruth Prabhu, Nithya Menen, Ajay, Saranya Ponvannan, Girish Karnad, Sathyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu