27 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య అపురూప చిత్రం.. మెమొరబుల్ ఫోటోలు!
నట సింహం బాలకృష్ణ అపురూపమైన చిత్రానికి 27 ఏళ్ళు పూర్తయ్యాయి. 1991 జులై 18 ఆదిత్య 369 చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రం వెండితెరపై సెన్సేషన్. సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన క్రియేటివిటీ ఒక ఎత్తైతే.. యువకుడిగా, శ్రీకృష్ణ దేవరాయులుగా బాలయ్య అద్భుతంగా నటించాడు. విడుదలై 27 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన అపురూపమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాలంలో ప్రయాణించేలా
హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన సైన్స్ ఫిక్షన్ క్రియేటివిటీని సింగీతం శ్రీనివాసరావు తొలిసారి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేశారు. కాలం లో ప్రయాణించే మెషిన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

ఎన్నిసార్లు చూసినా
శ్రీనివాసరావు దర్శకత్వం, బాలయ్య నటన ఈ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా చేసాయి. హీరోయిన్ మొహిన నటన కూడా అద్భుతంగా ఉంటుంది. హీరో తరుణ్ ఈ చిత్రంలో బాల్య నటుడిగా నటించాడు.

ఇళయరాజా గురించి
ఈ చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మూడు కాలాలలో సాగె ఈ చిత్రానికి అందుకు తగ్గట్లుగా అద్భుతమైన సంగీతం అందించారు. జాణవులే.. నెరజాణవులే సాంగ్ చాలా మంది సినీ అభిమానులకు ఫేవరేట్ సాంగ్.

వర్కింగ్ స్టిల్స్
దర్శకుడు సింగీతం శ్రీవాసరావు బాలయ్యకు సన్నివేశం వివరిస్తున్న వర్కింగ్ స్టిల్స్ వైరల్గా మారింది. 27 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు ఈ అపురూపమైన ఫోటోలని ట్రెండింగ్ గా మార్చారు.

100 రోజుల చిత్రం
అప్పట్లోనే ఈ చిత్ర వంద రోజుల వేడుక ఘనంగా జరిగింది. 100 రోజుల వేడుకకు సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. బుల్లి తరుణ్ కూడా ఈ ఫొటోల్లో స్టైలిష్ గా నిలబడి ఉన్నాడు.


Click it and Unblock the Notifications











