మెగా హీరోలు- సెకండ్ ఫిలిం సెంటిమెంట్
మొదటగా పవన్ ని చూసుకుంటే..ఆయన తొలి చిత్రం ఆడకపోయినా రెండో చిత్రం గోకులంలో సీత ఘన విజయం సాధించింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పవన్ ని నటన తెలిసిన హీరోగా ఎలివేట్ చేయగలిగింది.
అలాగే అల్లు అర్జున్ ..కి గంగోత్రి తో స్టార్ డమ్ రాకపోయినా..రెండో చిత్రం ఆర్య తో ఆయన మెగా హీరోగా ఎదిగిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా మారి, ఇప్పటికి అభిమానులను అలరిస్తూనే ఉంది.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే... ఆయన మొదటి చిత్రం చిరత కాగా..రెండో చిత్రం మగధీర ఆయన స్టామినా ఏంటో భాక్సాపీస్ కి తెలియచేసింది. అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్ని బ్రద్దలు కొట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం మెగాభిమానుల గుండెల్లో నిలిచిపోయింద.
ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రస్దానం ప్రారంభించారు. ఆయన రెండో చిత్రం కొత్త జంట. మొదట చిత్రం అసలు ఎప్పుడు వచ్చిందో..ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. ఈ నేపధ్యంలో ఈ రెండో చిత్రం సెంటిమెంట్ అల్లు శిరిష్ కి వర్కవుట్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. మరి భవిష్యత్ ఏమి నిర్ణయించిందో చూడాలి.


Click it and Unblock the Notifications












