దొంగ వ్యాపారం: ‘రుద్రమదేవి’ని వదల్లేదు!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్న దొంగ వ్యాపారాల్లో కొత్త సినిమాల పైరసీ వ్యాపారం ఒకటి. దర్శకనిర్మాతులు ఎంతో కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాలను కొందరు అక్రమంగా పైరసీ చేస్తూ భారీగా నష్టం కలిగిస్తున్నారు. తెలుగులో విడుదలైన ప్రతి సినిమాకూ ఈ సమస్య ఎదురవుతోంది. ఆ మధ్య విడుదలైన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి' కూడా పైరసీ వల్ల నష్టపోయింది.
తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' చిత్రం కూడా పైరసీకి గురైంది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రి నుండి ఒక ఒక ల్యాప్ టాప్, నగదు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తి ఈ ముఠాలో కీలకంగా ఉన్నాడు. వివిధ వెబ్ సైట్ల ద్వారా పైరసీ సినిమాలు అప్ లోడ్ చేస్తూ నెలకు భారీగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రుద్రమదేవి' అక్టోబర్ 9న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. సినిమాపై ముందు నుండి అంచనాలు ఉండటం, 3డిలో తెరకెక్కిన తొలి తెలుగు చారిత్రాత్మక చిత్రం కావడంతో అన్ని చోట్లా ముందే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. తెలుగులో భారీ ఓపెంనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా రుద్రమదేవి పేరు తెచ్చుకుంది.

మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్.
ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications











