Akhil Mishra Passed Away: సినిమా ఇండస్ట్రీలో విషాదం... 3 ఇడియట్స్ నటుడు మృతి
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో నటుడు మృతి చెందాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా మృతి చెందారు. 58 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూశారు. బాల్కనీలో ఏదో పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి కింద పడి మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే....
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా ఈరోజు సెప్టెంబర్ 21న కన్నుమూశారు. ముంబైలోని తన ఇంట్లోని బాల్కొని వద్ద ఏదో పని చేస్తుండగా... జారిపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అఖిల్ మిశ్రా మృతిచెందినట్టుగా చెబుతున్నారు.

గాయపడిన అఖిల్ మిశ్రాను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అఖిల్ మిశ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని సమాచారం. పోస్టుమార్టమ్ నివేదికల తర్వాత అఖిల్ మిశ్రా మరణానికి స్పష్టమైన కారణాం తెలియనుంది.
అయితే ఈ ఘటన చోటుచేసుకున్న అఖిల్ మిశ్రా భార్య , నటి సుజానే బెర్నెర్ట్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ముంబైకి బయలుదేరారు. ఇక ఆమె ఆయన మరణం తెలియగానే కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 'నా భాగస్వామి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, నా గుండె ముక్కలైంది' అని కన్నీటిపర్యంతమవుతోంది.

అఖిల్ మిశ్రా 1965లో జన్మించాడు. అతడు.. ఉత్తరన్, ఉడాన్, సిఐడి, శ్రీమాన్ శ్రీమతి, హతిమ్‌తో సహా అనేక ప్రముఖ టెలివిజన్ షోలలో నటించారు. కొన్నేళ్లుగా డాన్, గాంధీ మై ఫాదర్, శిఖర్, 'భోపాల్: ఎ ప్రేయర్ ఫర్ రెయిన్'తో పాటు పలు చిత్రాలలో కూడా కనిపించాడు. అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 3 ఇడియట్స్ చిత్రంలో లైబ్రేరియన్ దూబే పాత్రలో అఖిల్ నటనకు మంచి గుర్తింపు దక్కింది.

అఖిల్ మిశ్రా మొదటిగా 1983లో మంజు మిశ్రాను వివాహం చేసుకున్నాడు. 1997లో మంజు మరణించిన తర్వాత.. 2009 ఫిబ్రవరిలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్‌ను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ఫోన్ చేసి దైర్యం చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











